27, డిసెంబర్ 2015, ఆదివారం

charvitha charanalu


                 చర్విత చర్వణాలు


కనురెప్పల చాటున అనుభవాలహేల

చివురుటాకుల చిరుగాలి
కురులను రేపితే ప్రేమగా
సరిదిద్దిన అనుబంధం
భాస్కరుని వేడి కిరణాలు
మోముని కందిస్తే
చేరుమాలు తో సేద దీర్చిన అనురాగం
వెన్నెల కిరణాలు నిలువెల్లా మెరిపిస్తే
తన్మయత్వంతో మైమరిచి మరుల
చూపుల మెరుపులు కురిపించిన ఇష్టం
విద్యుత్ లేదని విసుగుచెందితే
నా విద్యుల్లత నీవే అన్న వైనం
నిలువెల్ల అల్లుకున్ననీ మోహం
వ్యాహాళి లోవర్షపు ధారల లో
తడిసిన అందాలకు గొడుగు
పట్టినట్లే పట్టి తడిసిన అందాలకు
దోసిళ్లు పట్టిన గడుసుతనం
శీతల రాత్రుల పరిష్వంగాలు
తెల్లవారనీయని కాంక్షలు
ఆరారు ఋతువుల కు అభినివేశాలు
అందాలు కరిగినా ఆత్మలు విడిపోయినా
మనో యవనిక పై అహర్నిశలు
కదలాడే ఆనంద వీచికలు
సాంధ్రత నిండిన సంసారాలు
శతాబ్దాలు గడిచినా పునర్చణాలు
చర్విత చర్వణాలు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి