24, జూన్ 2014, మంగళవారం

                        మరోబాల్యం 
కడుపున పుట్టినప్పుడు కన్నా 
పెరిగి పెద్దవాడైన కలగని పుత్రోత్సాహం 
పుత్రుని ప్రేమాభిమానాలు చూరగొన్నప్పుడు 
పొంగిపొరలే పిత్రు హృదయం పొంగే పాల సముద్రం 
తమను కన్నవారి దగ్గర మొదటి బాల్యం 
తాము కన్నకన్నవారి దగ్గర రెండో బాల్యం 
వృద్దానం బాల్యం కదా అలా సాగితే అదే కదా అదృష్టం
                  పల్లెటూర్లు 

మసక వెలుగులో భూపాల రాగం 
కోడి కొక్కొరో కోలుతోతో సూర్యుడి ఆగమనం  
పక్షుల కువకువల ఉషోదయం 
తుషార బిందువులతో విరిపూల దరహాసాలు 
పాలవాళ్ళ సైకిళ్ళు ఇంటి కళ్ళాపు శబ్దాలు 
వంటింటిలో అమ్మ కలిపే కాఫీ ఘుమఘుమలు
చిరు చలి బద్దకాలు వదిలించి 
శుభోదయం పలికే ప్రకృతి అందాలు 

                                         స్వేచ్చావిహంగాలు 

స్వేచ్చా విహంగాలు కన్నె పిల్లలు 
ఉరకలేసే వయసు ఉయ్యాల వూగుతుంది 
పరువములొ ఉన్న పడుచులను చూసి ప్రకృతి పులకిస్తుంది 
అమ్మాయిల నవ్వుల గల గలలకు ఏరు పరవళ్ళు తొక్కుతుంది 
గాలి ఈల వేసి కుర్రకారు జోరు కి హోరవతుంది 
పల్లెసీమలో ఉయ్యాల జంపాల ప్రతి మదిలో జ్ఞాపకాలహేల 
తుళ్ళి పడే యవ్వనం ఒక వింత అయితే 
కలవరింతలు కవ్వింతలు కూడా ఆటలే అమ్మాయిలకి