9, డిసెంబర్ 2011, శుక్రవారం

                           స్వీట్ మెమరీ    
ఉదయపు వేళ, ఎప్పుడైనా ఆరు గంటలకు, మనసులో 'మెరుపులా' గుర్తొచ్చే 'స్వీట్ మెమరీ' వైజాగ్ నుండి వచ్చే గోదావరి ఎక్స్ ప్రెస్ లో అమ్మానాన్నగారి రాక కోసం, ముందు రోజు రాత్రి నుండే, ఎదురుచూపులు. త్వరగా కాఫీ  డికాక్షన్ తీసి, పాలు కాచేసి,
ఆటో శబ్దం కోసం ఎదురు చూస్తూ  వుండటం ఒక తీయని అనుభూతి.
చాల మంది పిల్లలకి, 'తండ్రి' కేవలం తండ్రి మాత్రమే కాదు కష్టం, సుఖం, ప్లస్, మైనస్, అన్ని షేర్  చేసుకోగలిగే,  స్నేహితుడు. తప్పు చేసినా, సున్నితంగా హెచ్చరించే మార్గ దర్శకుడు. తమ పిల్ల్లల ఉన్నసద్గుణాలని మెచ్చుకునే ఏకైక ఆప్తుడు. 'తల్లి ప్రేమ' సరే, సరి. పిల్లల దగ్గరకు వెళ్ళాలి ,అనుకోగానే, ఎవరికీ ఏమిస్టమో' ఆ రకంగా 'ఏమైనా చేసి,తీసుకు రావాలి' అన్నతపనతో ఏవేవో చేసి తీసుకు వచ్చేది.తల్లితండ్రులు ఏమి తెస్తారు?అన్నఆత్రం పిల్లలకి  వుండదు. 'కానీ' మనవలు మనవరాళ్ళకి మాత్రం తెచ్చినవి చూపిస్తేనే కానీ స్కూల్ కివెళ్ళాలి అని వుండదు అలాఅమ్మమ్మ తాతయ్య రాగానే, ఇదే కాలనీ లో ఉన్న, మా చెల్లెలు 'పద్మ'కి ఫోన్ చేసి  అమ్మవాళ్ళు వచ్చారు నువ్వు వచ్చేయి అని పిలవడం, అది ఎక్కడి పనులు అక్కడే వదిలి, వచ్చేయడం యింక సందడే సందడి. దాని పిల్లలు, మా పిల్లలు, వాళ్ళ చుట్టూ చేరిపోయి, ఇచ్చినవి తీసుకుని, అప్పుడు స్కూల్ కి వెళ్ళేవారు.వాళ్ళుఅక్కడి విశేషాలు, ఇక్కడి విశేషాలు, కలపోసుకుంటూ 'కాఫీ' లు 'టిఫిన్లు' తో పాటు ఆ సందడి అలా కొనసాగేది అలా కన్నవారి ప్రేమానురాగాలు అనుభవించడం ఎంతో అదృష్టం 'కానీ' అలా జంట పక్షులు లాగ ఇద్దరు ఒకరికి ఒకరు తోడు గా, ప్రయాణం చేసి, పిల్లల దగ్గర కు వచ్చేవారు.అందులో ఎంతో ఆనందం వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ట్రైన్ ఎక్కించటానికి వెళ్లినా బాధ అనిపించేది కాదు  కానీ నాన్న గారు పోయాక అమ్మ ఒకత్తి ప్రయాణం చేస్తుంటే గుండెలో ఎంతో బాధ.పిల్లలం ఎందరున్నా ఒంటరి పక్షిలా శారీరక బాధలు మానసికంగా ఒంటరితనం, అనారోగ్యాలు,ముందు భవిష్యత్ పిల్లలదగ్గరే వుండాలి అన్నభావాన్ని  జీర్ణించుకోలేక,బాధ పడుతుంటే, లోలోపల బాధ అనిపిస్తుంది,ఎవరికైనా ఇంతేనా అనిపిస్తుంది. అందుకే గడచిన కాలమే, ఒక 'స్వీట్ మెమరీ' గా రోజు గుర్తు చేసుకుంటూ వుంటాను.

6, డిసెంబర్ 2011, మంగళవారం


BANANA CHOCOLATE CAKE RECIPE


Relish this culinary bliss of banana chocolate cake with following ingredients banana, sweet chocolate chips and milk.


Ingredients:



1 egg
1 1/2 tsp baking powder
1 cup meshed banana
1 1/2 cup all purpose flour
3/4 cup semi sweet chocolate chips
1/2 cup unsalted butter which is melted
1/4 tsp salt
2/3 cup white sugar
1/4 cup milk


How to make banana chocolate cake:
  • In a large mixing bowl stir together all purpose flour, sugar, salt and baking powder.
  • Take another bowl and mix together melted butter milk egg and meshed bananas.
  • Now add the banana mixture into the flour mixture until thoroughly blended.
  • Be careful not to overmix.
  • Add the chocolate chips. Preheat the oven to 350 degrees F to 175 degrees C.
  • Grease and flour a 9x13 inch pan.
  • Pour the batter into the pan and bake it for 32-35 minutes or until the toothpick inserted into it comes out clean.
  • When the cake gets baked take out the pan from the oven and let it cool for 10-15 minutes.
  • This cake will have some melted chocolate but no crumbs.

 
                                               పేరులోనే 'డర్టీ' 
నిజంగా పేరు చూసి సినిమాకి వెళ్ళాలంటే ఇబ్బంది గా అనిపించింది. కానీ, 'విద్యా బాలన్' అంటే ఉన్న 'ఇష్టం' పోయిన 'సిల్క్ స్మిత' పైన ఉన్న సానుభూతి, ఆ సినిమా చూసేలా, ప్రేరేపించాయి.లోగడ 'రేఖ ఆస్థా'  'టాబు అస్తిత్వ్' చాందిని బార్' 'షబానా అజ్మి మండి'  చూడాలని అనిపించినపుడు కూడా ఇదే పరిస్థితి,  ఆ సినిమాలు చూసాక ఆ ,యా డైరెక్టర్స్ కాన్సెప్ట్ అర్ధమయి, అర్ధవంతమయిన సినిమాలు చూసే వారి కోవలో, మేము వున్నాము. అనే సంతృప్తి కలిగింది.
ఒక 'స్త్రీ' సినిమా నటి కావాలన్న తపనతో, తన పరిధులన్నీ,అధిగమించి తను కోరుకున్న లక్ష్యాన్ని సాధించినా, తమకు, ఎదురు తిరిగినందుకు,ఆమెని డర్టీ గా చూపించి.సొమ్ము చేసుకొన్న వారు, అన్నినిరసనలు విమర్శలు ఆమె కే ఆపాదిస్తారు.నటనకు,
అవకాశాలు రాకపోవడం.ఇండస్ట్రి లో అందరి నిరాదరణ, ఆర్ధిక ఇబ్బందులు, ఒంటరితనం, ప్రేమ రాహిత్యం, ఎవరినైనా 'ఎంత వేధిస్తాయో' అవన్నీ ఆత్మ హత్య కు పురిగొల్పడం చాలా సహజంగా చిత్రీకరించారు ఈ సినిమాకి మూలం 'సిల్క్ స్మిత' జీవితం అన్నారు.కానీ ఇలాంటి అభాగినులు ఎందఱో,అనిపించేలా వుంది ఇటువంటి పిక్చర్ ని ధైర్యంగా ప్రోడ్యుస్ చేసిన ఏక్తా కపూర్ అండ్ శోభా కపూర్ ని అభినందించాలి అన్ని పక్కకి పెడితే నా ఉద్దేశ్యంలో, 'విద్యా బాలన్' కు అవార్డ్ రావాలి. అంత గొప్పగా కేరెక్టర్ లో ఇమిడి పోయింది.ఇది నా అభిప్రాయం.

5, డిసెంబర్ 2011, సోమవారం

                                ఫీల్ 
'దేవానంద్' ఇంక లేడు అంటే మనసుని పిండేస్తున్నట్లు బాధ. చనిపోయిన వారందరూ ఎక్కడకి వెళ్లి పోతారో? ఏమో'కానీ తన వారిని కోల్పోయిన వారు మాత్రం జీవశ్చవాలు గా మిగిలిపోతారు. గత జన్మ రుణ శేషాలు ఈ జన్మ లో   అనుబంధాలు గా,ఏర్పరచుకుని ఎల్లకాలం వుండాలని, తాపత్రయ పడతాము.'జనన మరణాలు సర్వసాధారణం' అని పెద్దలు చెపుతుంటారు. కానీ 
మనిషిని పోగొట్టుకోవడం కన్నా వేరే బాధ లేదు 
చక్కని పూల పొదరిల్లు లా అల్లుకున్నపూలవనం లాంటి ఇల్లు వసివాడిపోతుంది ఆత్రేయ గారన్నట్లు మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలు   అప్పుడేమవుతాయో ? మనిషి కి మనసే తీరని శిక్ష

క్యాబేజ్ పచ్చడి

                            క్యాబేజ్ పచ్చడి 
కావలసినవి 
క్యాబేజ్ చిన్నది 1 
పచ్చిమిరపకాయలు  4 
ఎండు మిర్చి 6 
చింతపండు 10 గ్రాములు   
సాల్ట్ తగినంత 
రిఫైండ్ ఆయిల్   4 స్పూన్స్ 
శనగపప్పు    2 స్పూన్స్ 
మినపప్పు   1  స్పూన్ 
ఆవాలు 1/2  
జీలకర్ర 1/2 
పసుపు చిటెకెడు 
కొత్తిమీర ఒక కట్ట 
ఇంగువ 1 స్పూన్ 
తయారు చేయు విధానం --క్యాబేజ్ ని సన్నగా తురుముకోవాలి. స్టవ్ వెలిగించి. కళాయి లో ఆయిల్ వేసి, అందులో  క్యాబేజ్ తురుము ని వేసి, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు ,సాల్ట్, పసుపుఇంగువ  వేసి, మెత్తగా మగ్గే వరకు ఉంచాలి. ఇంకొక కళాయి లో ఆవాలు మినపప్పు శనగ పప్పు జీలకర్ర ఎండు మిర్చిని  ఆయిల్ లో వేయించుకొని చల్లారాక కొన్ని పోపు గింజలు వుంచి మిగతావి మిక్సి లో గ్రైండ్  చేసాక మగ్గించిన క్యాబేజ్ తురుము ని కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఏదైనా బౌల్ లోకి తీసుకొని పోపు గింజలతో పాటు
కొత్తిమీరను కూడా వేసి అలంకరించాలి ఇది అన్నం లోకే కాకుండా చపాతీలకి దోసలకి కూడా బాగుంటుంది
 






4, డిసెంబర్ 2011, ఆదివారం

స్నేహమంటే? స్నేహమంటే చాలా మంది కేవలం షాపింగ్ కి సినిమాలకు వెళ్ళడమే టైం పాస్ కే అనుకుంటారు కానీ కష్ట సుఖాలు చెప్పుకొని సాంత్వన పొందడం కోల్పోయిన ధైర్యాన్ని స్థైర్యాన్ని పొందడం ఎలాంటి బలహీనతలున్నా మన్నించగల స్నేహితురాలు లేక స్నేహితుడు ఉన్న మనిషికి ఆ స్నేహం ఒక వరం ప్రపంచమంతా వ్యతిరేకించినా స్నేహితులున్న వారెప్పుడు ఒంటరి కారు బంధువులు ఎందరున్నా వారందరూ మనకి మన ప్రమేయం లేకుండా ఏర్పడిన వారు కానీ స్నేహితులన్న వారు మనం కోరుకుంటే దొరికిన వారు కాబట్టి స్నేహమైన బందుత్వమైనా నిలబెట్టుకుంటేనే స్థిరమవుతుంది లేదా వ్యర్ధమవుతుంది


అగాధమైన జలనిధి లోన ఆని ముత్యాన్ని శిలాసదృుశువులైన బండరాళ్లలోని రవ్వంత చల్లదనాన్ని అనంతమైన బడబాగ్నీలోని అరుదైన సీతలాన్ని ఇలా అరుదైన వాటిని స్వంత పవృత్తిగా కల నేను ఒక మామూలు ఆడదాన్ని Posted by kameswarichangalavala at 6:32 AM 0 comments


సిమ్లా మిర్చి కూర కావలసినవి సిమ్లా మిర్చి 6 కొబ్బరి కోరు 1/2 కప్ పుట్నాల పప్పు 1/2 అల్లం చిన్న ముక్క పచ్చిమిర్చి8 కొత్తిమీర ఒక కట్ట జీలకర్ర 1 స్పూన్ ఉల్లి పాయలు 2 పసుపు చిటెకెడు రిఫైండ్ ఆయిల్ 50 గ్రాములు సాల్ట్ తగినంత చేయు విధానం ముందుగా సిమ్లా మిర్చిని ముక్కలుగా చేసుకుని వాటిని ఒక దళసరి గిన్నెలో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి అది కాగాక సిమ్లా మిర్చి ముక్కలు వేసి సాల్ట్ పసుపు వేసి మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం పుట్నాల పప్పు ని కొద్దిగా నీరు చేర్చుకొని మిక్సి లో గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని మగ్గిన సిమ్లా మిర్చి ముక్కలలో వేసి మరి కొంత ఆయిల్ ని వేసి స్టవ్ ని సన్న మంటలో మగ్గనివాలి తర్వాత కొత్తి మీర తో అలంకరిస్తే బాగుంటుంది ఇది చపాతీలలో మరియు రైస్ తో కూడా బాగుంటుంది


2, డిసెంబర్ 2011, శుక్రవారం

kotthimeera rice

                                                             కొత్తిమీర రైస్
కొత్తిమీర రైస్ తాయారు చేయడానికి కావలసినవి 
1) సన్న బియ్యం 1/2 కే జి 
2) క్యారట్ 2 
3) బీన్స్ 12 
4) బంగాళా దుంపలు 2    
5) పచ్చిమిర్చి 12  
6) కొత్తిమీర 3 కట్టలు 
7) నెయ్యి   ఒక కప్
8) రిఫైండ్ ఆయిల్ 1/2
9) సాల్ట్ తగినంత 
10) జీడి పప్పు     25  గ్రాములు 
11)నాన బెట్టిన  పచ్చి బఠానీలు గ్రీన్ కలర్ వి 1/2  కప్
చేయు విధానం  ------- ముందుగా  బంగాళాదుంప   బీన్స్ క్యారట్  చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి 
స్టవ్ వెలిగించి కళాయి లో ఆయిల్ వేసి అది వేడి అయ్యాక అందులో జీడిపప్పు వేసి కొంచం వేగాక కట్ చేసుకున్న వెజిటబుల్ ముక్కలు కూడా వేసి వేయించాలి కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సి లో గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని కూడా వేసి కొంచం వేగాక రైస్ కుక్కర్లో బియ్యం కడిగి ఆ బియ్యానికి ఒకటికి ఒకటిన్నర లెక్కన నీరు పోసి అందులో కళాయి లో వేయించినవి వేసి తగినంత సాల్ట్  నెయ్యి వేసి కుక్ చేయాలి (ప్రెషర్ పాన్ లో కానీ ప్రెషర్ కుక్కర్లో కూడా  చేయొచ్చు  కానీ వాటర్ మాత్రం ఎక్కువ  కాకుండా చూసుకోవాలి ) కుక్ కాగానే గరిటతో మొత్తం కలపాలి దీని ఉల్లి పెరుగుచట్నీతో కానీ ఏదైనా గ్రేవీతో కానీ తిన వచ్చు మసాల ఇష్టం లేక బిరియానీ తినని వారికీ ఇది బాగా నచ్చుతుంది కొత్తిమీర సువాసనతో ఘుమఘుమలాడుతూ వుంటుంది ఈ సువాసన కి ఆకలి పెరుగుతుంది