అక్కడి నుండి కుక్కి సుబ్రహమణ్యం చూసాము 
మేము ప్రతి కార్తీక మాసం లో వేసినట్లే ఈ కార్తీక మాసం లో కర్ణాటక లోని కొన్ని ముఖ్య పుణ్య క్షేత్రాలు కి టూర్ ప్లాన్ చేసాము
మిత్రులు చాలా మంది యాత్రావిశేషాలు తెలియ చేయమన్నారు వారి కోరిక మేర కు మీ అందరి కోసం మా ట్రావెలాగ్
ఆడ మొగ చిన్న పెద్ద కలిపి మొత్తం
28మంది ఈ నెల 27,వ తేదీన బయలుదేరాము





ముందుగా చాలా పెద్ద టూర్ కాబట్టి
బయట ఫుడ్ ఆరోగ్యాల కి జిహ్వ కి హితం కాదని ఒక కుక్ నాగేశ్వరరావు ని హెల్పర్స్ ముగ్గురు సువర్ణ కుమార్ రామలజ్ష్మి లను తీసుకళ్లాను
రోజుకి ఒక స్వీట్ ఒక హాట్ లెక్కన ఏడువారాల స్నాక్స్ రకరకాల బిస్కట్స్
కేంపర్స్ లో మినరల్ వాటర్ పట్టుకెళ్లాము
ఇంక ఇంట్లో హెల్పర్స్ సహాయంతీ కూరకారం ఇఢ్లీ కారప్పొడి
ధోసావకాయ టమేటో అల్లం గోంగూర చింతకాయ ఆవకాయ మాగాయ వంటి పచ్చళ్లు కందిపొడి నెయ్యి పట్టుకెళ్లాము
ఇంక వంటకి కావల్సిన సరంజామా కూరలు పెద్ద గ్యాస్ స్టౌ కాఫీ ఫ్లాస్క్ గిన్నెలు మిక్సీ కూడాతీసుకెళ్లాము
ఇంక యాత్రలో ఒజ ముఖ్య అనుభవం మూ అందరి కీ తప్పక చెప్పాలి
కర్ణాటక బోర్డర్ పాస్ ఏడు రోజులకు గాను
రూట్ పాస్ తో పాటు తీసుకోవాలి
రూట్ పాస్ ట్రావెల్స్ వాళ్లే ఇస్తారు
బోర్డర్ పాస్ మాత్రఙ ఆ స్టేట్లోకి ఎంటర్
అయ్యే ముందు తీసుకోవాలి



రాయచూర్ వెళ్లి తీసుకోవాలంటే ఆఫీస్ అవర్స్ అయిపోయాయి మార్నింగే తీసుకోవాలి అన్నాడు డ్రైవర్ సరే అని
దారిలో ఒక దాబా దగ్గర అపి కుక్ వేసిన ఇఢ్లీ తిని తెల్లవారు ఝామున సుగునూర్ అనే ఊరు చేరుకున్నాము అక్కడ
సుగురేశ్వర స్వామి గుడి తుంగ భద్ర
నది ఉంది అంటే అక్కడ ఆగాము కాల క్రత్యాలు నదీ స్నానం గుడి దర్సనఙ ముగుఙచుకుని వచ్చాము
ఈలోగా మా కుక్ చేసిన ఉప్మా తిని కాఫీ తాగి చేసిన వంట అంతా స్టీలు డబ్బాలోకి గరెటెల తో ఒ సహా సర్దించి మార్నింగ్ 10గంటల కు రాయచూర్
వెళ్లా ము బోర్డర్ పాస్ 18 వేలు కడదామని చూస్తే శని ఆదివారాలు శెలవులని తెలిసింది
సరే సోమవారం ఎక్కడ ఉంటే అక్కడే కడదామని మధ్య లో లంచ్ చేసి రాత్రి కి హంపీ చేరుకున్నాము
హంపి లో టెంపుల్ దగ్గర

                                                                                                                      
   హంపి లో                                                          
                                                                                                             
                                     





పద్మ మహల్ దగ్గర  















ఉగ్ర ఉగ్ర నరసింహుడు దగ్గర 




అప్పటికే  రాత్రి కావటాన రూమ్స్ తీసుకున్నాము టిఫిన్ చేయించడానికి అనుకూలత లేక ఆర్డర్ ఎర్ర నూక ఉడకపెట్టిన ఉప్మా అనే పదార్దం వచ్చింది మరేమి లేవని అదే మా టమేటో చట్నీ తో తన్నామనిపించి పడుకున్నాము                                                                                                                                                                                            కొల్లూర్ ముకాంబిక టెంపుల్                                                                                  
పొధ్దున్నే మేము మాట్లాడుకున్న               గైడ్ రాగానే హంపి లో ఉన్న  పద్మ మహల్ విరుపాక్ష గుడి ఉగ్ర నరసింహుడు                                        మారికొన్ని.చూసి.ఒక పార్క్ లో లంచ్ చేసి రాత్రికి హారి హర.క్షేత్రం దర్శంచి రాత్ర నారాయణాశ్రమం లో ఉండి మార్నింగ్ బయలుదేరి మూకాంబిక టెంపుల్ దర్సించి దగ్గరలో ఉన్న అనె గొందె వినాయకుడి టెంపుల్ చూసాము
 షిమోగా లో టాక్స్ కడదామని దిగగానే ఆర్టీఏ ఆఫీస్ కోసం కర్ణాటక ట్రవెల్స్ యూనియన్ బస్ స్టాప్ దగ్రర అడుగుతుంటే మా డ్రైవర్ ని ఒక బ్రోకర్ పట్టుకుని మేము బోర్డర్ టాక్స్ కట్టకుండా కర్ణాటక లో తిరిగినందుకు మాకు 10వేలు ఫైన్ పడ్తుందని తన ద్వారా కాస్త తగ్గిస్తామాని చెప్పి మా డ్రవర్ ని హడల గొడ్తుంటే అఎమంవుట్ ఏదున్నా మేము కడ్తాము అంటే వద్దు మీరొస్తే తగ్గించరు అన్నారు అయినా నేను ఊరుకోలేదు మీ అవసరంలేదు అవన్నీ మేమే చూసుకుంటాము అని ఒక ఆటో తీసుకుని నేను ఇంకొకరిని తీసుకుని ఆర్టీఏ ఆఫీస్ కి వెళ్లి తిన్నగా ఎమ్ డి ని కలిసి మా ప్రాబ్లమ్ చెప్పి మేము వాలంటీర్గా మీ టాక్స్ కడదామని వస్తే ఈ పెనాల్టీ ఎందుకు కట్టాలి మీ ఆఫీస్ బంద్ పెట్టి మమ్మలని పెనాల్టీకట్టడమేంటి అంటే.నో నో పెనాల్టీ మీరు వెళ్లి టాక్స్ కట్టండి చాలు అన్నారు కట్టేటప్పుడు మళ్లీ 3500 తగిలిఙచారు పెనాల్టీ అని మళ్లీ ఎమ్ డి ని కలిసి టాక్స్ కట్టి వచ్చేసరికి ఆ గ్యాంగ్ అంతా పరార్ మా వాళ్లు అందరు నా ధైర్యాన్ని పొగిడి పొగిడి నా వెయిట్ పెంచేసారు ఈ విషయం అందరూ తెలుసుకుంటారు అనే రాస్తున్నాను ఎమౌంటు ఎంతున్నా మనమే కట్టుకోవాలి కాని ఎవరినీ నమ్మ కూడదు ఇంక మాడ్రైవర్ నోట మాట లేదుతర్వాత జోగ్ ఫాల్స్ చూసాము 
జోగ్ ఫాల్స్ దగ్గ్గర మేమందరం                                                                    
 రాత్రికి మురుడేశ్వర్ చేరాము యధావిధిగా రూమ్స్ రెస్ట్లు మార్నింగ్ టిఫిన్ చేసి మురుఢేశ్వర్ లో గుడి దర్శనం 18అంతస్తుల గోపురం లిఫ్ట్ ద్వారా
ఎక్కాము మ్యూజియం చూసాము బోట్ ఎక్కి సముద్రంలో షైర్ కొట్టాము
రాత్రికి మురుడేశ్వర్ చేరాము యధావిధిగా రూమ్స్ రెస్ట్లు మార్నింగ్ టిఫిన్ చేసి మురుఢేశ్వర్ లో గుడి దర్శనం 18అంతస్తుల గోపురం లిఫ్ట్ ద్వారా
ఎక్కాము మ్యూజియం చూసాము బోట్ ఎక్కి సముద్రంలో షైర్ కొట్టాము

ఇంక మా వాళ్లు షాపింగ్ లే షాపింగ్
నేను
హెచ్చరికలే హెచ్చరికలు లంచ్ తర్వాత
గోకర్ణం ఉడుపి చూసాము
ఉడుపి తేలో కృష్ణుడి రధం


రాత్రికి శ్రింగేరి చేరాము మేము శారదాదెవికి హారతి ఊరేగింపు కళ్లారా చూసి సంబరపడ్డాము అక్కడే గుడిలో అన్నప్రసాదం తిని నైట్ హాల్ట్ చేసాము

శ్రింగీరి టెంపుల్ లో భోజన శాల

మర్నాడు ధర్మ స్తలివెళ్ళాము అక్కడ మంజు నాధ స్వామి ని దర్సనం చేసుకున్నాము 


  కుక్కి సుభ్రమణ్యం లో దర్సనం చేసుకున్నాము అకడ అది సుభ్రహ్మన్యుడిని  గుడిని కుడా దర్సనం చేసుకున్నాము 



రాత్రికి హోరనాడు చేరాము ఉదయాన్నే లేచి ఆహ్లాదకరమయిన పరిసరాలలో వెలసిన  అన్న పూర్ణేశ్వరి గుడి దర్శనం చేసుకున్నాము 
అక్కడ  బియ్యం దానం చేయాలిట. చేసి వారిచ్చిన కొన్ని బియ్యం తెచుకుని మన ఇంట్లో బియ్యం డబ్బాలో వేసుకుంటే అన్ని కి లోటు వుండదు  అమ్మ వారి కుంకుమ పూజ కి డబ్బు కట్టి అమ్మవారి ప్రసాదం తీసుకున్నాము

అన్నపూర్ణా దేవి హొరనాడు లో   

 మైసూర్ దారి పట్టాము
ఇక్కడ ఒక విషయం చెప్పాలి మొత్తం ఘాట్ రోడ్స్ ప్రయాణమే మంచి డ్రైవర్ చిన్న వెహికిల్స్ సేఫ్టీ ఏదీ డైరెక్ట్ గా ఒకదాని వెనుక ఒకటిగా ఉండవు వెళ్లిన దారినే వెనుక కు వచ్చి వెళ్లాల్సినవే ఎక్కువ కోంచెం జాగ్రత్తలు అవసరం
మా వాళ్లు డాన్స్ స్ అంత్యాక్షరి అంటే మైసూర్ రోడ్స్ పట్టే వరకు ఓన్లీ మ్యూజిక్ అది కూడా ఓల్డ్ మ్యూజిక్ అని చెప్పాను
అందర్నీ తీసుకొచ్చాము కదా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి అన్నదే నా ఉద్దేశ్యంమైసూర్ లో నైట్  స్టే చేసాము 
చాముండేశ్వరి టెంపుల్ మైసూర్ లో 
 మార్నింగ్
 మహరాజా పేలస్ చాముండేశ్వరీ టెంపుల్ చూసాము సమయా భావం వల్ల బెంగళూర్ స్కిప్ చేయాల్సి వచ్చింది
అలాగే ఆలంపురం బీచుపల్లి అలాగే ఆలంపురం బీచుపల్లి టెంపుల్స్ కూడా స్కిప్ చేయాల్సి వచ్చింది
 అమ్నవారికి ఆంజనేయస్వామికి నమస్కారం చేసుకున్నాము తప్పకుండా త్వరలో దర్శనం చేసుకుంటాము అనుకున్నాము 
మొత్తానికి అలా మా యాత్ర పూర్తి చేసుకుని వచ్చాము కార్తీక మాసం లో పది రోజులు వన భోజనాలు చెసిన ఫీలింగ్ మాతో వచ్చిన వారందరు వారి తాలూకు వారికి యాత్ర చాలా బాగా అయింది అని చెప్పారు అది చాలుగా మనకి
                                                                                  
వ్యాఖ్యలు
Changalvala Kameswari

ఒక వ్యాఖ్యను వ్రాయండి...