మా కాశీ ప్రయాణం విశేషాలు
మా సత్యం అన్నయ్య ఎ వి ఎస్ ఎన్ మూర్తి వైజాగ్వరసకి మరిది మా ఎ వి ఎస్ రామారావు తలపెట్టి న మా ప్రయాణం చాలా ఆనందంగా జరిగింది
మా ట్రైన్ హైదరాబాద్ నుండి వెళ్ళాల్సిన పాట్నాఎక్సప్రేస్స్ కాన్సిల్ అయిందని తెలిసి అందరం చాల దిస్సప్పాయింట్ అయ్యాము
ఎలాగయినా ప్రయతించమని మేము గొడవ పెట్టాము రెండు నెలల ముందు రిజర్వ్ చేయిస్తేనే ఇలా అయింది అయినా తత్కాల్ లో ట్రై చేద్దాము అందరు రెడీగా అయితే వుండండి ఎవరికీ ఎక్కడ బెర్త్ దొరికిన వెళ్లి పోదాము అంటే సరే అన్నాము కానీ ఎవరికీ కుదురు లేదు ఎలాగో మా చెల్లి బలిజేపల్లి పద్మావతి కి తెలుసున్న ఒకరి ద్వారా తత్కాల్ కౌంటర్ లో తెల్లవారు ఘమున 3 గంటలకు వెళ్లి 7 గురు నిలుచుని మొత్త్తం 26 టిక్కెట్స్ సంపాదించారు వైజాగ్ నుండి 9 మంది వరంగల్ కి రావాలి అది కుడా కొందరు రాజమండ్రి లో ఎక్కాలి వాళ్ళు అందరు వరంగల్ వస్తే మేము హైదరాబాద్ నుండి 18 మంది వరంగల్ వెళ్లి అక్కడ వాళ్ళందరిని కలుపుకుని తెల్లవారు ఝామున 4గంటలకు గంగా కావేరి ట్రైన్ ఎక్కాలి
మొత్త్తనికి సాయంకాలం 6గంటలకి అందరం మా నండూరి వెంకటేశ్వరరావు బావ వాళ్ళింటికి వచ్చి బస్సు లో వరంగల్ బయలుదేరాము మా అందరికి మా ఆస్థాన కేటరింగ్ రవి చేత టిఫిన్స్ రెడీ చేయించారు మా మరిది రామారావు [ఇక్కడ ఒక మాట చెప్పాలి మేము పెత్తల్లి పినతల్లి పిల్లలం కలిసి ముప్పయి మంది అందరం కలిసి పెరిగాము మేమున్న అల్వాల్ లోనే ఒక పది కుటుంబాలు వున్నాము అందుకని ఎలాంటి అరమరికలు లేకుండా వుంటాము ]అందరమూ వరంగల్ స్టేషన్ లో కలుసుకున్నాము ట్రైన్ ఎక్కాము ల మొదలయ్యింది మా ప్రయాణం వెళ్ళిన వాళ్ళ వివరాలు [మా ఎన్ వి రావు బావ లక్ష్మి కాంతం అక్క ]ఆత్రేయపురం కాట్రావుల పల్లి సూర్యనారాయణ బావా రాధాక్క]అజ్జరపు రామారావు అలివేలు]బలిజేపల్లి నాగరాజారావు పద్మావతి ]రామారావు గారి అక్క వేణు వదిన ప్రకాష్ అన్నయ్య గారు ]గోటేటి సూర్యకుమారిఅక్క ఫ్రం నర్సాపురం]నేదునూరి రామశర్మ రమణ కుమారి]రామారావు గారి తమ్ముడు అజ్జరపు వెంకటేశ్వర రావు లక్ష్మి]నేను అంటే చెంగలవల కామేశ్వరి హైదరాబాద్ నుండి వైజాగ్ నుండి అజ్జరపు సత్యనారాయణ మూర్తి [మా సత్యం అన్నయ్య ]లక్ష్మి వదిన]రాంబాబు అన్నయ్య మణి వదిన]సత్యం అన్నయ్య బావమరిది దంపతులు ]వారి బంధువులు మరో ముగ్గురు మొత్తం 28 మంది అన్న మాట
ఇలా అందరం 30/6/2015 న వరంగల్ నుండి బయలు దేరాము ట్రైన్ లో క్విజ్ కండక్ట్ చేసాను నేను పట్టుకెళ్ళిన ప్రైజులు ఇచ్చాను స్పెషల్ బహుమతి మా చెల్లి కి కూడా ఇచ్చాను ఎందుకంటే దాని వల్లే ప్రయాణం ఆగిపోకుండా జరిగింది కదా
ఇంకా అంతాక్షరి కాసేపు హవుసీ గేమ్ కాసేపు ఇలా అన్నిభోగీలు తిరుగుతూ సందడి చేసాము ఒకోబాచ్ కీ
ఒకో దగ్గర వచ్చింది అందుకే ఫుడ్ తినేప్పుడు అందరు ఒక దగ్గరే కలిసి తినడం ఆటలు పాటలు ఒక దగ్గరే ఇలా ప్రయాణం చేసి వారణాసి మూడో రోజు ఉదయానికి చేరాము
వారణాసి లో రిలయన్స్ డిజిటల్ ఎదురుగ వున గంగోత్రి హోటల్ లో రూముకి 4 గురు లెక్కన సెటిల్ అయ్యాము
అందరు
స్నానాలు చేసి టిఫిన్స్ తిని రెస్ట్ తీసుకుని మళ్లీ లంచ్ చేసి పడుకుని
సాయంకాలం కాశీ విశ్వేశ్వరుడి గుడికి వెళ్ళాము అక్కడినుండి గంగా హారతి కి
వెళ్ళాము బోటు లో ఇలా తిరిగి హారతి కనులార వీక్షించి రూం కి రాగానే
టిఫిన్స్ రూం కె వచ్చాయి తినేసి కాసేపు కబుర్లు చెప్పుకుని పడుకున్నాము
మర్నాడు గంగా నది లో స్నానం చేసి గట్టు మీద వున్న ఆలయాన్ని అన్న పూర్ణ దేవిని దర్శించుకుని చిన్నగా షాపింగ్ చేసుకుని వస్తు అన్నపూర్ణ సత్రం లో భోజనం చేసి రూం కి వచ్చి మళ్ళి కబుర్లు కొనుక్కున్నవన్ని చూపించడం అందరు 'బాగుంది ఎక్కడ కొన్నావు? అంటే సంబరపడి పోవడం అదో సరదా మర్నాడు మార్నింగ్ కాఫీలు టిఫిన్స్ అయ్యాక 8 గంటలకు బస్ ఎక్కితే త్రివేణి సంగమం నైమిశారణ్యం వెళ్ళాలి ఎవరు లేటు చేయకూడదు అని అన్నయ్య రామారావు లు హెచ్చరించారు అందర్నీ సరే సరే అన్నాము
][ఇక్కడ ఇంకో సరదా విషయం చెప్పాలి పొద్దున్నే కాఫీల కోసం హోటల్ ఎదురుగా ఉన్న ఛిన్న హోటల్ కి వెళ్ళే వాళ్ళం వాడిచ్చే చిన్న గ్లాసు లో కాఫీ ఎ మూలకి మాకు అందుకే అందరం శ్రద్ధగా మా గ్లాస్ లు పట్టి కెళ్ళే వాళ్ళం
అ గ్లాస్ లో కనీసం మూడు గ్లాసుల కాఫీలు పోస్తే అప్పుడు మాకు సంతృప్తిగా వుండేది అందరికీ మొదటి కాఫీ పెద్ద పట్టు ఉండాలి కదా అది అది చూసి మా బావలు మరుదులు అన్నయ్యలు మా మీద జోక్స్ వేసే వారు
'దిష్టి తగులుతుంది మీకు అంత కాఫీ తాగ కండె' అని మీరు కొన్నాళ్ళు ఇక్కడే వుంటే వాడు కోటీశ్వరుడు కావడం గ్యారంటీ అని మీరంతా వైట్ ఎలి ఫెంట్ సే మిమ్మల్ని మేము కాబట్టి భరాయిస్తున్నాము ఇంకేవదయినా పారిపోతాడు
అనే వారు అయినా మేము లక్ష్య పెట్టేవాళ్ళం కాదనుకోండి ఇలా ఒకరిద్దరు తప్ప అందరు అదే కేటగిరి కదా]
బస్ లో అలహాబాద్ కి బయలు దేరాము
ఇంకా తీసారమ్మ మా వాళ్ళు
వాళ్ళు తెచ్చిన తిను బండారాలు అన్ని ఇన్ని కాదు ఒకళ్ళు కజ్జి కాయలు పూతరేకులు మినపసున్నుండలు కారపూసలు కారబ్బున్డీలు పాల కోవా లు గవ్వలు లడ్డులు కరకజ్జం అచ్చులు
ప్రయాణం అని అందరు తలో మూడు రకాలు లెక్కన ఎన్నో నాకు పేర్లు కూడా గుర్తు లేవు ఒకళ్ళ తర్వాత ఒకలు సప్లై చేయడం పాటలు వింటూ అన్ని రకాలు ఆరగిస్తూ ముందుగ త్రివేణి సంగమం దేరాము
అక్కడికి దిగగానే మా సూర్య నారాయణ బావ శాస్త్రోక్తం గా పంచ కట్టుకుని మర చెంబు ఒక చేత మరో చేత్తో గొడుగు పట్టుకుని సతీ సమేతంగా వస్తే చూసి మురిసి పోయి ఇలా ఒక ఫోటో తీసాను అది చూసి మా పద్మ వతి దంపతులు కూడా ఇలాగె వచ్చారు సతీ సమేతంగా ఇలాగె వెళ్ళాలి ట బాగుంది కదూ

ఇలా అందరం నావలు
మాట్లాడుకుని గంగ యమునా సరస్వతి కలిసే పవిత్ర
త్రివేణి సంగమాని కి చేరుకున్నాము అక్కడ
సంకల్పం చెప్పించుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నాము మా పద్మావతి దంపతులు అక్కడ వేణీ దానం కార్యక్రమం నిర్వహించారు

అంతకు ముందు రామేశ్వరం నుండి తేచ్చిన ఇసుకని త్రివేణి సంగమం లోని నీటిలో అందరం కలిపాము ఆ రకంగా మాయాత్ర పరిపూర్ణమయింది అనుకున్నాము
ఇలా అన్ని ముగించుకుని ఆవురావురుమంటూ భోజనం చేద్దామని హోటల్ కి వెళ్ళాము
వెళ్ళగానే హోటల్ వాళ్ళు రోటి చపాతీ అని లిస్టు చదవగానే అవేమి వద్దు పప్పు అన్నం పెరుగు చాలు అని ఆర్డర్ ఇచ్చారు మా వాళ్ళు ఈ లోగా మా అడ గ్యాంగ్ గోంగూర పచ్చడి తో ఒకరు కంది పొడి ఒకరు నెయ్యి డబ్బా స్పూన్ తో ఒకరు అన్న పూర్ దేవీల్లాగా ప్రత్యక్షం అయ్యారు
హాయిగా అక్కడ కుడా పెరుగు విత్ అరటి పండు తో భోజనం హ హ హ అక్కడ చూస్తున్న ఉత్తరాది వాళ్ళ మొహాల్లో విస్మయం ఎంత ప్లానింగ్ అని అనుకునివుంటారు
ఇంకా అక్క్కదినుంది ఋషులు దేవతలు తిరిగిన వేద భూమి పుణ్య భూమి నైమిశారణ్యం కి బయలు దేరాము
అక్కడికి వెళ్లేసరికి రాత్రి 11 అయింది దారిలోనే డిన్నర్ అయిపోవడాన రూమ్స్ లో సర్డుకున్నాము
మర్నాడు గోమతి నది లో స్నానం చేసాము అక్కడే ఉన్న గోవు కి ప్రదక్షిణాలు పూజ బ్రాహ్మణుడి ఆధ్వర్యం లో చేసుకుని అక్కడినుండి108చక్రాలు వున్నా కొలను లో శ్రీ చక్ర స్నానం చేసుకుని రూమ్స్ కి వచ్చి రెడీ అయి టిఫిన్స్ తిని అక్కడున్ తొమ్మిది ప్రదేశాలు చూపించడానికి ఆటోలు మాట్లాడారు వరసగా సూత మహా ముని టెంపుల్ వెంకటేశ్వరస్వామి టెంపుల్
అవన్నీ దర్శించుకుని సయం కలం రిటర్న్ అయ్యాము వారణాసి వచ్చేసరికి తెల్లవారు ఝాము అయింది
వచ్చాక షరా మాములుగానే రేస్ట్లు ఫ్రెషప్ లు కాఫీలు టిఫిన్స్ చేసుకున్నాము
మర్నాడు కాల భైరవ స్వామి గుడి గవ్వలమ్మ గుడి సారనాథ్ అన్నిఅన్ని
చూసుకున్నాము మర్నాడు ముఖ్యమయిన పద్నాలుగు ఘాట్ లలో స్నానాలు చేస్తే
బాగుంటుందని ఒక బోటు ని మాట్లాడారు
అందరం వెళ్లి చేసి వచ్చి మళ్లీ షాపింగ్
కి వెళ్ళాము పెద్ద జోక్ ఏంటంటే ఒకరిద్దరు ఏదో షాప్ కి వెళ్లి కొన్ని
చీరెలు తెస్తే అవి నచ్చిన వాళ్ళు మళ్ళి ఆ షాప్ కి పోడం వాళ్ళు కుడా
కొనుక్కు రావడం అల అందరు కలిసి ఒక డెబ్బయి చీరలు దాకా కొన్నారు
మర్నాడే
ప్రయాణం అనుకుంటుండగా మా ట్రైన్ కాన్సిల్ అయిందని ఒక వార్త అది వినగానే
అందరికీ టెన్షన్ ఎన్నో అలోచించి
చివరికి ఒక ఏసీ బస్ మాట్లాడారు ఈ లోగా మా బావలు అన్నయ్య లతో
'ఒరేయ్ వాళ్ళందర్నీ ఇంకా షాపింగ్ కి వెళ్ళకుండా అపన్దర్రా ఉన్న డబ్బులన్నీ
ఇక్కడే అవగొట్టే లా వున్నారు వీళ్ళు ' అని గోల మేము నవ్వులు
ఎలాగయితేనేమి మళ్ళీ వరంగల్ మీదుగా అలాగే ఫుల్ జోష్ తో సంతోషం సంతృప్తి
తో హైదరాబాద్ కి మేము వైజాగ్ బాచ్ వైజాగ్ కి సేఫ్ గ చేరుకున్నాము
చివరగా చిన్న మాట నేను ఇదివరకే వారణాసి వెళ్ళాను అవన్నీ చూసాను స్నేహితులతో కానీ చిన్నప్పటి నుండి కలిసి మెలిసి పెరిగిన అక్కలు చెల్లెళ్ళు అలవాటు అయి ఆప్తులయిన బావలు మరుదులుప్రేమ తో వుండే అన్నయ్య్యలు వాత్స్యలం గ చూసే వదిన లతో వెళ్ళడం ఒక మధురాను భూతి ఇటువంటి ట్రిప్ వేసిన సత్యం అన్నయ్యకి అన్ని ఏర్పాట్లు చేసిన రామారావు కి థాంక్స్ అందరి తరపున
29, అక్టోబర్ 2015, గురువారం
ఈ మాట ఎవరన్నా అది నిజం" ఎందుకంటే కొందరి మాట తీరు చూస్తే
వీళ్ళు ఇక మారరా? అనిపిస్తుంది అటువంటివారి ఎంత దూరంగా వుంటే
అంత మంచిది అనిపిస్తుంది
వారికీ
తెలిసినదే వేదమన్నట్లు వితండవాదం అవతలి వారి మాట పూర్తి కాకుండానే వాదన
చేసేవారు వయసుతో కానీ వరసతో కానీ పని లేదు వాళ్ళ సెంటిమెంట్స్ అందరి మీద
రుద్దుతు అదే విజ్ఞానం
అన్నట్లు విషయాల పట్ల సరి అయిన అవగాహనా ఉన్నా లేకున్నా అందరితో గొడవలు పెట్టుకుంటూ
ఉండే వారు ప్రతీ వారినీ ఎదిరిస్తూ అదిలిస్తూ ఉచిత సలహాలు ఇచ్చేవారు
అన్ని చోట్ల అన్ని విషయాలలో తమకే ప్రాధాన్యత ఉండాలి అందరి కన్నా
తమకే అన్ని తెలుసు అందరు తమనే సంప్రదించాలి అని ప్రత్యేక గుర్తింపు కోసం తహ తహ లాడే వారు ఇలా కొన్ని దశాబ్దాలుగా అలాగే ఉన్నారు
వింత
ఏమిటంటే ఇటువంటి వారికి తాము అందరికీ సహాయం చేసినా తామంటే ఎవరికీ ప్రేమ
లేదు లక్ష్యం లేదు అనుకుంటారు కానీ తమ మాట తీరు మార్చుకోరు
పెద్దవారి
పట్ల గౌరవం ప్రేమ వినయం నమ్మకం అని ఉండాలి వారు చాదస్తమో వారికున్న
అపారమయిన అనుభవమో రంగరించి చిన్నవాళ్లకి చెప్తుంటారు సలహాలు ఇస్తుంటారు
ఏదైనా తప్పనిపిస్తే కేకలేస్తారు అవన్నీ చేయటానికి వాళ్ళకి అధికారం
ఉందనుకుంటారు అ త్రుప్తి వాళ్ళకి ఇవ్వడానికి మనం ఒకింత సహనం లేదా మౌనం
సంతోషమో ప్రకటిస్తే సరిపోతుంది
అంతే కానీ చెప్తుండగానే గయ్యిమండం ఎందుకు చెప్పాలి అన్నట్లు
విరుచుకు
పడటం చేస్తే అ పెద్దరికం చిన్నపోతుంది అది తప్పు అని తెలుసుకుంటే మన మీద
మనకే కంట్రోల్ వస్తుంది మనల్ని మన పిల్లలే ఫాలో అవుతారు ముందు ముందు మన
పని అంతే అవుతుందని తెలుసుకోవాలి
చిన్న పిల్లల పట్ల వాత్సల్యం అలవర్చుకోవాలి 'కాకి పిల్ల కాకి కి ముద్దు' అన్నట్లు ఎవరి పిల్లలు వారికేక్కువ
మనం ఎంత
పెట్టినా పెట్టకున్న్న సంతోషమే కాని వేరే వాళ్ళ పిల్లలని విమర్శించడం
మరేవరితోనో పోల్చి చిన్నబుచ్చడం వారి తెలివితేటలకు మనం కొలబద్దలు అవాల్సిన
అవసరం లేదు
మన చేతనయితే సహాయం లేకుంటే ప్రోత్సాహం ఇంతే మనం ఎవరి పిల్లలకయినా ఇవ్వ్వవలసినది అంతే కానీ
మానసికంగా వాళ్ళని బాధ పెట్టెల మాట్లాడకూడదు
అసలు ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఎలా ఉండ కూడదో ఇలాంటి వార్ని బంధు మిత్రుల లో పరిచయస్తులలో నా ప్రియమయిన శత్రువులను
చూసి వారి మాటలకు విమర్సలకు పొగడ్తలకు సానుభూతి కి చిన్న చూపు కి నేను కూడా స్పందించిపోయి
పోయి వారిలాగే నేను రియాక్ట్ అయి మనశ్శాంతి పోగొట్టుకున్నాను కాని
మరి కొందరు మహోన్నతమయిన వ్యక్తులను కూడాచూసాను
చిరునవ్వు తో పలకరించే ఒక 'యశోద ఆంటీ', మనసులో బాధలున్నా, శారీరక
రుగ్మతలున్నా, ఎవరితో అయినా కలిసిపోయి మాట్లాడే,' మా అమ్మ' అవతలి వారి కోణం
నుండి ఆలోచించే 'మా నాన్నగారు' ఎవరికైనా తనకి వీలైన సహాయం అందించే 'నా
తమ్ముడుశ్రీను' వాడి క్రమ శిక్షణ 'ఎన్ వి రావు బావ', మరిది వరసైన
'రామారావు' అంతస్తులతో సంబంధం లేకుండా అందర్నీ ఆదరించే' విజయలక్ష్మి
ఆంటీ దంపతులు' ఎంతో గొప్ప స్థాయి అన్నిటిలో వున్నా చాలా సాదాగా వుండే
సున్నితంగా మాట్లాడే మిత్రురాలు నాగమణి ఇలా ఎందఱో నా మనసుని
ఆకట్టుకున్నారు
వాళ్ళలో మంచి ని అలవార్చుకోడానికి అలాగే కొందరి లో కన్పించే' లౌక్యం'
కక్కుర్తి 'కుళ్ళు 'స్వార్ధం' అతి తెలివి' కీర్తి కండూతి'కర్కసత్వం అసూయా[
ముఖ్యంగా పెద్ద గొంతు తో అరుస్తూ మాట్లాడే వాళ్ళంటే చిరాకు] నాకు రాకుండా
వుండాలని ప్రయత్నిస్తూ వుంటాను.
వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగిర పడక
వివరింపగన్ కని కల్ల నిజమెరిగే
నేర్పరి సుమతీ అన్నట్లు
మెల్లగా
నా ప్రపంచాలు నేను సృష్టించుకుని సాధ్యమయినంతగా నన్ను నేను
నియంత్రించుకుంటూ నా కంటూ గిట్టని వారు లేకుండా ఉండాలని నన్ను నేను
మార్చుకోడానికి రోజు ప్రయత్నిస్తాను
ఎందుకంటే నాలో నేను కని పెట్టిన దుర్గుణం ఒకటుంది ఇంకేమున్నాయో తెలియదు కానీ అదేమిటంటే
నేను
చేసే పనులలో పెద్ద పెద్ద పనులు ఇంటి వి కావొచ్చు మహిళా మండలి కాని వివిధ
సంఘాల లో చేపట్టే పనులు కాని సక్రమంగా అవ్వాలని తాపత్రయ పడటమే కాదు ఎవరికీ
చెప్పినా అవి సరిగ్గా అవవేమో అని అన్ని నా నెత్తినేసుకుని చేయాలనుకోవటం ఇది
కూడా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అని తెలిసిపోయింది
దీన్ని
తగ్గించుకోవాలి ఎవరికయినా అప్పచెప్పి వాళ్ళు సరిగ్గా చేయలేకపోయిన వాళ్ళ
మీద నా రియాక్షన్ ఉండకుండా ఉన్న నాలో నేనే మింగేయాలి అంత ఓపిక నాకు రావాలి
అని ఒంటరి నయి ప్రతి నిముషం కల లు కంటున్నాను నిరంతరం నాలో
మార్పుకి జగమంత కుటుంబం మనకి అందరితో సవ్యంగా ఉండటమే పరిణతి
కదా
16, జూన్ 2015, మంగళవారం
ప్రేమ దొరుకుతుంది
ప్రేమ మనకి దొరుకుతుంది మన ప్రమేయం లేకుండానే
ఎవరి ద్వారానో ఎప్పుడో ఎక్కడో ఎలాగో అలా మన మనసుకి మధురానుభూతి కలిగిస్తుంది
అందానికి ఆకర్షణకి ఐశ్వర్యానికి అవసరాలకి అతీతంగా
అనుకోకుండాఅవ్యాజమయిన ప్రేమ దొరికితే అది అంతరంగం లో ఆనందాన్ని కల్గిస్తుంది
అపరిచిత వ్యక్తుల పట్ల ప్రేమ ని ఇలా కూడా వ్యక్త పరచవచ్చు
తద్వారా ఇతరుల మనసుని ప్రేమతో గెలవవచ్చు అని ఫీల్ అయ్యాము
నేను మా అమ్మ మా చెల్లి పద్మ
ఆ ఫీల్ ని అందరితో పంచుకోవాలన్పించింది
అమ్మ రాసి పడిన' శ్రీ దేవి భక్తి గీతమాల 'ఎప్పుడో పదేళ్ళ క్రితం కేసేట్స్ రూపంలో
వచ్చినపుడు విని ఆనందించి
అవి అరిగిపోయి టేప్ రికార్డర్ పాడయ్యేన్తగా మక్కువతో విని
అమ్మ మీద అభిమానం పెంచుకున్నభక్తి పరురాలు సీతామహాలక్ష్మి గారు
పదేళ్ళ క్రితం ఎవరో ఇచ్చిన నా మొబైల్ నెంబర్ వెతుక్కుని
నాకు కాల్ చేసి మీ అమ్మగారు రాసిన పాటలన్నీ నాకు కావాలి
85 ఏళ్ళ వృద్ధురాలిని మీ దగరికి రాలేను
ఎంత ఏమవుంట్ ఇవ్వాలో చెప్తే ఇచ్చ్హేస్తాను
నాకు అందచేయండి అని అర్ధిస్తే సరే అన్నాను
ఆవిడకి అమ్మ పాటల 5 సి డి ల సంకలనం తప్పకుండా
అందించాలి అనుకున్నాను కానీ రొటీన్ బిజీలో పడి మర్చిపోయాను
ఈలోగా అమ్మ మా ఇంటికోచ్చిందని చెల్లి ద్వారా తెలుసుకుని
నాకు కాల్ చేసి ఎడ్రస్ తీసుకుని వాళ్ళ వంటావిడ ని సహాయం తీసుకుని వచ్చారు
పండు తమలపాకులాంటి వంటిపసిమి రంగు
నవ్వుతో మెరిసిపోయే ముచ్చటయిన రూపం
ఎప్పటినుండో తెల్సినట్టుగా మధురమయిన మాటలు
మమ్మల్ని మంత్రముగ్ధులను చేసాయి ఆమె వాగ్ధాటి మాటల పోగులయిన మమ్మల్ని
శ్రోతలుగా మార్చింది
ఆడపిల్ల ల దగ్గరికి ఒట్టి చేత్తో ఎలా వస్తాను ? అనుకుని ఆమె తెచ్చిన చీరలు స్వీట్స్
మామిడి పళ్ళు ఆవిడా స్వహస్తాలతో పెట్టిన పెసరావకాయ తేవడం చూసి ఆశ్చర్యం వేసింది
ఆవిడ ఒక్కరు వుంటారు పిల్లలు అయిదుగురు వాళ్ళ దగరికి రమ్మన్నా
ఆవిడ వెళ్ళ లేరుట ఎందుకంటే ఆవిడ 55 ఏళ్ల నుండి ఉంటున్న కాలనీలో
అన్ని వయసుల వారితో ఆవిడకున్న స్నేహం
ఎవరింటిలోఆవకాయ పెట్టిన ఎవరింటిలో ఏ శుభకార్యమయినా
ఈవిడ ని అడగకుండా ఏదీ చేయ్యరుట
అటువంటి అప్తులందర్నీ వదులుకుని అమెరికా లు వెళ్లి ఓ మూల ఎందుకు కూర్చోవడం ?
'ఏదో మా అయన పెన్షన్ ఇల్లు డబ్బు ఆస్థి ఇచ్చి వెళ్లారు
అయన నాకన్నాముందు పోయారు అన్న బాధ వున్నా,
అయన కి సేవ చేసుకున్నాను కదా జాగర్త్తగా పంపించాను కదా పిల్లలు కూడా ఏది కావాలన్నా ఇస్తారు
నా ఇంటిలో నేను చక్రవర్తిలా ఉన్నాను
మన పిల్లలు మనని బాగానే చూస్తారు కానీ వాళ్ళ పిల్లలతో మనకి పడాలి కదా
టి వి లు వేరు ఫోన్లు వేరు నాకు మొబైల్ వాడడం రాదు వాళ్ల ల్యాండ్ లైన్ లో నేను ఇంత మందితో మాట్లాడుతుంటే వాళ్ళకి బోరు కదా అందుకే నా భర్త ఆస్థానం లో
నా ఇంటిలో నేను చక్రవర్తిలా ఉన్నాను అని ఆవిడా చెప్తుంటే ముచ్చటగా అనిపించింది
ఆవిడ ఏర్పరచుకున్న ప్రపంచం లో ఆవిడ ఉండడం ఆనందం కదా అని పిల్లలు
కూడా సరే అన్నారుట
ఆవిడకి ఇంత వయసులో కూడా నో షుగర్ నో బి పి నో మోకాళ్ళ నొప్పులు
ఆవిడ జీవన విధానమే ఆవిడ ఆరోగ్యానికి మూల కారణం అనిపించింది
అపరిచితులమయినా ఆమె చూపించిన ప్రేమ ని చూస్తే మన చుట్ట్టు వున్నా వాళ్ళతో
మనమెలా ఉంటున్నాము?అని లోలోనే ఒకసారి ప్రశ్నించుకున్నాను
జీవితం లో ఎందఱో పరిచయమవుతారు కానీ కొందరే ప్రభావితం చేయగలుగుతారు
సీత మహాలక్ష్మి గారిలా
పెట్టుపోతలు లేకున్నా ఎటువంటి అరమరికలు లేకుండా హాయిగా మాట్లాడగలగటం కూడా ఒక ఆర్ట్
అది మనలో లేకున్నా ఇటువంటి వార్ని చూసి అలవర్చుకోవచ్చు
అటువంటి వారు మన దగ్గరుంటే ఎంత బాగుండేది అనిపించింది ఆ చల్లని తల్లి ని చూస్తే
అమ్మ వారు మిత్ర రూపిణి చైతన్య స్వరూపిణి కదా ఆవిడ భక్తులను ఆవిడే కలుపుతుంది అనుకున్నాము

11, జూన్ 2015, గురువారం
జీవితం ?
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అని తెలుసు
'వంకరగా వున్నా కూడా నాదే' అని కుర్కురే ప్రకటనలో చెప్పినట్లు
ఈ జీవితం ఎలా ఉన్నా నాదే 'అని ఆనందాలు దుఃఖాలు అన్ని అనుభవిస్తున్నాము
'జరగల్సినది జరక్క్క మానదు' అని మేము పాల్గొన్న 'సిద్ధ సమాధి యోగా'లో చెప్పిన మాట
ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటూ 'ముళ్ళ కంపలు రాయి రప్పలు దాటినాను
మొండి బ్రతుకును ఒంటిగానే మోసినాను రాగమన్నది గుండెలో రగులు తున్నది ఎందుకో
రగిలి రగిలి నేను నేనుగా మిగిలిపోవుటకా 'అని విషాద గీతాలు మననం చేసుకుని
నిట్టుర్చినా జీవితం సాగుతూనే ఉంది
ఈ జీవితం నన్ను సాధిస్తోంది ప్రశ్నిస్తోంది పరీక్షిస్తోంది సోధిస్తోంది బాధిస్తోంది విసిగిస్తోంది
కానీ భయపెట్ట లేకపోతోంది
ఎందుకంటే మొండివాడు రాజు కంటే బలవంతుడు కదా
దశల వారీగా మన ఆనందాలను లాక్కుని దుర్దశల వారీగా
సమస్యల ప్రహేళికలు మన ముందుంచి మన ఉనికినీ మన మేధస్సుకి సవాలు గా
మనని ధైర్యవంతులుగా శక్తివంతంగా మలచిన ఈ జీవితాన్ని ఏమనాలి
మేకపోతు గాంభీర్యముగా లో లోన గుండెలో అగ్నిపర్వతాలు ప్రజ్వరిల్లుతున్నా
కోటి వెతలు మనసుని క్రుంగ దీస్తున్నా ఎన్నో భయాలు ఎదను తొలిచేస్తున్నా
ముఖం లో దరహాసం ఉంటే చాలు 'రేసుగుర్రం' సినిమాలో 'శ్రుతి హాసన్' లాగా
నవ్వు, భయం ,కోపం, అన్నీ లోపలే సమయం దాని పని అది చేసుకుపోతుంది
ఫలితం ఏదయినా తప్పదు కదా అనుకొంటే చాలు
స్థితప్రజ్ఞులు అనిపించుకోవచ్చు

4, జూన్ 2015, గురువారం
అపురూపం +అనుభూతి
నా చిన్నప్పుడు మాకమలపిన్ని (అసలు కి అమ్మక్కయ్యే
కానీ మా ఇంకోఅమ్మక్కయ్య పిల్లలు అలా పిలిస్తే నేను కూడా అలాగే పిలిచేదాన్ని )
వాళ్ళ వూరు కాకిలేరు మా పెద్దనాన్న గారు అ ఊరికి కరణం గావుండేవారు
వాళ్ళకి నలుగురమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అక్కడికి 6మైళ్ళ దూరం వడలి
అక్కడ మా మాతా మహులు అయ్యగారి సత్య నారాయణ మూర్తి గారు కరణం గాఉండేవారు
అక్కడ నేను 5వక్లాస్ దాక చదువుకునే రోజుల్లో ప్రయాణాలు సినిమాలు అంటే తెగ పిచ్చిగ ఉండేది
అక్కడ అమ్మమ్మ గారింటిలో హైమవతి అమ్మక్కయ్య పిల్లలు నేను కలిసి
సెలవులకి కాకిలేరు వెళ్ళే వారము
ఈ రోజులల్లో తమ పిల్లలని చూసుకోడమే కష్టమని అనుకుంటున్నారు
కానీ అప్పట్లో ఎ బేదాలు లేకుండా అక్కచెల్లెల్ల పిల్లలని అన్నదమ్ముల పిల్లలని
చూసుకునేవారు
అందుకే పెళ్ళిళ్ళకి వేసవి సెలవులకి సుమారు 20 30 మంది మనవలు మనవరాల్లతో
ప్రతి లోగిలి కళకళ లాడేది
అప్పట్లో ఆ ఊరికి బస్ వుండేది కాదు ఎడ్లబండి రిక్షా లేదా 3 కిలో మీటర్ల నడక
అ వూరు వెళ్ళాలంటే ఇష్టం మా కమల పిన్ని చేసే రకరకాల చిరుతిళ్ళు తినడం
చెరువులో కలవ పూలకి వెళ్లడం గోరింటాకు మల్లెపూలు పెనుగొండ లో కన్యకాపరమేశ్వరి గుడికి
వెళ్ళడం మినర్వా ప్యాలెస్ దియేటర్ లలో సినిమాలు చూడటం అంత త్రిల్లె మాకు
పక్కింటి మాదా సత్యం ఇంట్లో పాడే గ్రామఫోన్ రికార్డ్సు వాటికీ మా డాన్సు లు
సూరిబాబు అన్నయ్య చదివే డిటెక్టివ్ పుస్తకాలు అన్ని ఎంతో నచ్చేది
ఒక విషయం లో భయముగా ఉండేది అదేమిటి అంటే ఆ ఊర్లో కరెంట్ ఉండేది కాదు
స్నానం కి పర్వాలేదు కానీ కొన్ని అవసరాలకి పుంత ల్లోకి వెళ్ళాల్సి వచ్చేది
అది కూడా ఎవరో ఒకరి సహాయంతో రాతిరిల్లు ఎ అవసరాలు రావొద్దు దేముడా అని
దేముడికి మొక్కుతూ వుండేదాన్ని కానీ
ఆ భయానికి ఎవరికీ రాని అవసరాలు నాకే వచ్చేవి (హహహ )
ఇప్పుడయితే నవ్వొస్తోంది పాపం మా కమల పిన్ని రవివర్మ చిత్రంలోలా లాంతరు
తీసుకుని నన్ను తీసుకెళ్ళేది అ ఇంట్లో
అన్నింటిలోకి నాకు బాగా నచ్చిన వస్తువు ఒకటుండేది అదేమిటంటే
మా పెదనాన్నగారు మంచినీళ్ళు తాగే స్టీల్ గ్లాస్ అది నచ్చి
అది మా పెదనాన్నకే ప్రత్యేకం అని నాకు కూడా అలాంటిది కొనిస్తానని ఊరుకో పెట్టేవారు
ఎప్పటికయినా నీకే ఇస్తాను అని చెప్పేది మాకమల పిన్నిఅ మాటకి వాళ్ళ పిల్లలు కూడా
అవును కామేశ్వరి కె ఇవ్వు దానికి భలే ఇష్టం అ గ్లాస్ అంటే అనేవారు
అలాగే ఈ మద్య మా పెదనాన్న కాలం చేసారు
అయన గుర్తుగా అగ్లాస్ మా ఇంటికోచ్చేసింది దాని చూస్తే నా బాల్యం గుర్తొస్తుంది
నా ఇష్టాన్ని గుర్తు పెట్టుకొని నాకిచ్చిన అ వస్తువులో మా వాళ్ళ ప్రేమ కనిపిస్తుంది
3, అక్టోబర్ 2014, శుక్రవారం
నీళ్ళు రాని కళ్ళు పొడారిపొయి గుండెని తడుపుతాయి
ఒంటరి మనసులో కతలు వెతలు గా మిగిలిపొతె తీరని ఎడబాటు భవిష్యత్ ను భయపెడుతొంది ఇక ఈ జీవినమెల ? అన్న విరక్తి! గత వైభవాన్నీ ఒక గురతుగా భావించి, ఊరుకోలేక, పోయిన వారిని ఈ జీవితములో చూడము! అన్న సత్యం నలువునా కుంగదీసింది. కుమిలి పోయేలా చేసింది. పండగలు భయపెడతాయి. వేడుకలు వేధింఛుతాయి. అందరిలొ మనలేక, ఒంటరిగా ఉండలేక, శఫించబడినవారిలా మనుగడ దేనికి? అనే భావన దీనిని మోయాలసిందే తప్పదు ఏఫాపానికో ఈ శిక్ష

దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్‌లు (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి