నిన్న ఒక థ్రిల్; ఎప్పుడో సుమారు ముప్పయి అయిదు సంవత్సరాల క్రితం, నరసాపురం లో నాతో కలిసి ఆడుకున్న, స్నేహితురాలు ఉషా రాజేశ్వరి నన్ను గుర్తు పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చింది.
' ఆనందం తో నిజంగా కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు నాకు కల్లా కపటం తెలీదు బ్రతుకు బాధలు తెలీవు 'బ్రతుకు బాటలో పూల తోపాటు రాళ్ళూ ముళ్ళు అంతరంగంలో ఆనందాల తో పాటు, అగ్నిగుండాలు 'దూషణ భూషణ తిరస్కారాలు' అన్ని అనుభవించి బండ బారిన మనసులో, అప్పటి జ్ఞాపకాల హేల నాకొక సంతోషం కలిగించింది.
పెళ్లి తో విడిపోయి, మనవలను ఎత్తాక కలుసుకుంటే, 'ఇంత జీవితం ఇన్ని అనుభవాలు ఎలా పంచుకోవటం?'
స్కూల్ ఫ్రెండ్స్ క్లాసు మేట్స్ బెంచ్ మేట్స్ కాకుండా సెలవులలొ ఆడుకున్న ఫ్రెండ్ కూడా కలవటం రియల్లీ హార్ట్ టచ్చింగ్.
బాల్య స్నేహితులు ఫామిలీ ఫ్రెండ్స్ కాలనీ స్నేహితులు పరిచయాల ద్వార ఏర్పరచుకున్న క్లోజ్ ఫ్రెండ్స్ వుండటం నా అదృష్టం అనిపించింది. నా' ప్లస్ అండ్ మైనస్' షేర్ చేసుకోటానికి ఆర్ధిక అసమానతలు కుల గోత్రాలు స్నేహ బంధానికి అడ్డురావని అందరికీ తెలుసు.
సహాయం చేసినా చేయకున్నాసాటి వారి భావాలను ఇష్టాలను వ్యక్తిత్వాన్నిచంపేయాలని చూడరు.నిర్దేశించాలని శాసించాలని చూడరు. అందుకే స్నేహితులంటే నాకు ప్రాణం' ఆర్ధిక అసమానతలు శాసించనిదేమైన వుంది అంటే అది ఒక స్నేహమే బంధువులు మనం బాగుండాలి అని కోరుకుంటారు బాగుంటే సంతోషిస్తారు బాగుండకపోతే సహాయాలు చేస్తారు
కాని ఏదో రకంగా మన పరిస్థితులకు మన్నే ఆపాదిస్తారు కారణాలు వాళ్ళే చెప్పేస్తారు తెలివి లేకపోడం ప్లాన్ చేసుకోపోడం దుబార చేసుకున్నరానో ఏదో మన మొహాన్నే అనేస్తారు మనం నోచ్చుకోకూడదు నొచ్చుకుంటే విశ్వాస ఘాతకులనే పేరు మోయల్సిందే స్నేహితులు హితంగా చెప్తే బంధువులు విమర్శగా చెప్తారు అదీ తేడా ఏది ఏమయినా స్నేహం మన ఎంపిక అందుకే దాన్ని కాపాడుకోవాలి