26, జూన్ 2016, ఆదివారం
25, జూన్ 2016, శనివారం
విలువ
అందనంత వరకే అందం విలువ
హద్దు దాటనపుడే స్నేహానికి విలువ
హద్దు దాటనపుడే స్నేహానికి విలువ
దూషించనంతవరకే కోపానికి భయం
హింసించనంత వరకే బంధానికి బలం
హింసించనంత వరకే బంధానికి బలం
అర్ధించనంతవరకే బంధుత్వానికి ఉనికి
బ్రతికున్నంత వరకే బాధలకు పరాకాష్ట
బ్రతికున్నంత వరకే బాధలకు పరాకాష్ట
అగ్నిలో కాలినపుడే స్వర్ణాని కి మెరుగు
సానపెట్టినపుడే వజ్రానికి మెరుపు
సానపెట్టినపుడే వజ్రానికి మెరుపు
అరగదీసినపుడే చందనానికి పరిమళం
శోధించినపుడే సిద్దించేది పరిపూర్ణత
శోధించినపుడే సిద్దించేది పరిపూర్ణత
వర్షం తో నేను
ఆకాశం లో మెరుపులు
నా నయనాల కాంతుల్లో చిందుతాయి
నా నయనాల కాంతుల్లో చిందుతాయి
మేఘాల్లో వర్ష ధారలు భూమికి అభిషేకం
నా మాటల ధారలో నీకు నాప్రేమాభిషేకం
నా మాటల ధారలో నీకు నాప్రేమాభిషేకం
అప్పుడప్పడు ఉరిమే ఉరుములు
నా అలకలో ని తీపి శాపాలు
నా అలకలో ని తీపి శాపాలు
గుండె అదిరేలా పడే పిడుగులు
నా మౌనం లో నీ గుండెలయలు
నా మౌనం లో నీ గుండెలయలు
వానలొస్తే అవనికి సస్య శ్తామలం
వలపువానలొస్తే బ్రతుకే నిత్య కల్యాణం
వలపువానలొస్తే బ్రతుకే నిత్య కల్యాణం
తుపాన్ వస్తే లోకమే భయానకం
వియోగమొస్తే మనిషికే విషాదకరం
వియోగమొస్తే మనిషికే విషాదకరం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)