కడలి ఘోష
నీలి నీలి కెరటాలతో తెల్లని నురుగులు కక్కే సముద్రాన్ని
చాలా ప్రశాంతముగా అందంగా కనిపిస్తాను
గాలి అలల పై ఊయలలు ఊగిస్తాను భావ లహరి లో తేలుస్తాను
నా కుక్షిలో అనుభవాల బడబానలాలు వున్నా అనుభూతి లేని శిలలున్నా
అభిమానులను ఆదరిస్తాను ఆనందాన్ని పంచి పెడతాను
ఆవేశ కావేషాల తోరగిలిపోయే వారు అన్ని మర్చేలా సేద తీరుస్తాను
ఆహ్లాదకరంగా గలగలమంటూ సందడి చేస్తూ హుషారేక్కిస్తాను
కష్టాలతో కాగిపోయి వేగిపోయిన వారికీ నా కడుపులో చోటిస్తాను
ఆ కళేబరాలను చూసి కడుపు మండిన వారు తిడితే
కన్నీరు పెడతాను లోలోనే అలమటిస్తాను
నా బాధలేవరికీ తెలీవని విషాదంగా నవ్వుకుంటాను
నా ఉనికి వుంటే చాలు నేనెవరికి అక్కర్లేదు
ఉప్పు కాసారం కాబట్టి సారం ఉన్నా పనికి రాని దాన్ని
నేను ఇగిరి పోయాక నా భస్మాలు అన్నిలవణాలుగా మారి
అందరికి జిహ్వకి రుచినిచ్చే సాధనాన్ని గా మీతో నే వుంటాను
నేను లేకుంటే కొందరు నన్ను వదులుకోలేక కొందరు
అస్వాదించలేక కొందరు మధన పడుతుంటే
జాలి పడతాను నవ్వుకుంటాను నేను
నేను గంభీర ముద్ర దాల్చినా రౌద్రముతో పరుగులెత్తి ఎగసి పడినా
అంతే వేగముగా నాలో నేనే కలిసిపోతాను
అనంతంగా అంతు లేని మిధ్యలా మిగిలిపోతాను