16, జూన్ 2015, మంగళవారం

                   ప్రేమ దొరుకుతుంది
ప్రేమ మనకి దొరుకుతుంది మన ప్రమేయం లేకుండానే 
ఎవరి ద్వారానో ఎప్పుడో ఎక్కడో ఎలాగో అలా మన మనసుకి మధురానుభూతి కలిగిస్తుంది
అందానికి ఆకర్షణకి ఐశ్వర్యానికి అవసరాలకి అతీతంగా 
అనుకోకుండాఅవ్యాజమయిన ప్రేమ  దొరికితే అది అంతరంగం లో ఆనందాన్ని కల్గిస్తుంది 
అపరిచిత వ్యక్తుల పట్ల ప్రేమ ని ఇలా కూడా వ్యక్త పరచవచ్చు 
తద్వారా ఇతరుల మనసుని ప్రేమతో గెలవవచ్చు అని ఫీల్ అయ్యాము
 నేను మా అమ్మ మా చెల్లి పద్మ 
ఆ ఫీల్ ని అందరితో పంచుకోవాలన్పించింది 
అమ్మ రాసి పడిన' శ్రీ దేవి భక్తి గీతమాల 'ఎప్పుడో పదేళ్ళ క్రితం కేసేట్స్  రూపంలో 
వచ్చినపుడు విని ఆనందించి 
అవి అరిగిపోయి టేప్ రికార్డర్ పాడయ్యేన్తగా మక్కువతో విని
 అమ్మ మీద అభిమానం పెంచుకున్నభక్తి పరురాలు సీతామహాలక్ష్మి గారు 
పదేళ్ళ క్రితం ఎవరో ఇచ్చిన నా మొబైల్ నెంబర్  వెతుక్కుని 
నాకు కాల్ చేసి మీ అమ్మగారు రాసిన పాటలన్నీ నాకు కావాలి
85 ఏళ్ళ  వృద్ధురాలిని మీ దగరికి రాలేను 
ఎంత ఏమవుంట్ ఇవ్వాలో చెప్తే ఇచ్చ్హేస్తాను 
 నాకు అందచేయండి అని అర్ధిస్తే సరే అన్నాను 
ఆవిడకి అమ్మ పాటల 5 సి డి ల సంకలనం తప్పకుండా 
అందించాలి అనుకున్నాను కానీ రొటీన్ బిజీలో పడి మర్చిపోయాను
 ఈలోగా అమ్మ మా ఇంటికోచ్చిందని చెల్లి ద్వారా తెలుసుకుని 
నాకు కాల్ చేసి  ఎడ్రస్ తీసుకుని వాళ్ళ వంటావిడ ని సహాయం తీసుకుని వచ్చారు 
పండు తమలపాకులాంటి వంటిపసిమి రంగు
 నవ్వుతో మెరిసిపోయే ముచ్చటయిన రూపం
ఎప్పటినుండో తెల్సినట్టుగా  మధురమయిన మాటలు
మమ్మల్ని మంత్రముగ్ధులను చేసాయి ఆమె వాగ్ధాటి మాటల పోగులయిన మమ్మల్ని 
శ్రోతలుగా మార్చింది 
ఆడపిల్ల ల  దగ్గరికి ఒట్టి చేత్తో ఎలా వస్తాను ? అనుకుని ఆమె తెచ్చిన చీరలు స్వీట్స్ 
మామిడి పళ్ళు ఆవిడా స్వహస్తాలతో పెట్టిన పెసరావకాయ తేవడం చూసి ఆశ్చర్యం వేసింది 
ఆవిడ ఒక్కరు వుంటారు పిల్లలు అయిదుగురు వాళ్ళ దగరికి రమ్మన్నా 
ఆవిడ  వెళ్ళ లేరుట ఎందుకంటే ఆవిడ 55 ఏళ్ల నుండి ఉంటున్న కాలనీలో 
అన్ని వయసుల వారితో ఆవిడకున్న స్నేహం 
ఎవరింటిలోఆవకాయ పెట్టిన ఎవరింటిలో ఏ  శుభకార్యమయినా 
ఈవిడ ని అడగకుండా ఏదీ చేయ్యరుట 
అటువంటి అప్తులందర్నీ వదులుకుని అమెరికా లు వెళ్లి ఓ మూల ఎందుకు కూర్చోవడం ?
'ఏదో మా అయన పెన్షన్ ఇల్లు డబ్బు ఆస్థి ఇచ్చి వెళ్లారు 
అయన నాకన్నాముందు పోయారు అన్న బాధ వున్నా,
 అయన కి సేవ చేసుకున్నాను కదా జాగర్త్తగా పంపించాను కదా  పిల్లలు కూడా ఏది కావాలన్నా ఇస్తారు 
నా ఇంటిలో నేను చక్రవర్తిలా ఉన్నాను
మన పిల్లలు మనని బాగానే చూస్తారు కానీ వాళ్ళ పిల్లలతో మనకి పడాలి కదా
టి వి లు వేరు ఫోన్లు వేరు నాకు మొబైల్ వాడడం రాదు వాళ్ల ల్యాండ్ లైన్ లో నేను ఇంత మందితో మాట్లాడుతుంటే వాళ్ళకి బోరు కదా అందుకే నా భర్త ఆస్థానం లో 
నా ఇంటిలో నేను చక్రవర్తిలా ఉన్నాను అని ఆవిడా చెప్తుంటే ముచ్చటగా అనిపించింది 
ఆవిడ  ఏర్పరచుకున్న ప్రపంచం లో ఆవిడ ఉండడం ఆనందం కదా అని పిల్లలు 
కూడా సరే అన్నారుట 
ఆవిడకి  ఇంత వయసులో కూడా నో షుగర్ నో బి పి నో మోకాళ్ళ నొప్పులు 
ఆవిడ జీవన విధానమే ఆవిడ ఆరోగ్యానికి మూల కారణం అనిపించింది 
అపరిచితులమయినా ఆమె చూపించిన ప్రేమ ని చూస్తే మన చుట్ట్టు వున్నా వాళ్ళతో 
మనమెలా ఉంటున్నాము?అని లోలోనే ఒకసారి ప్రశ్నించుకున్నాను 
జీవితం లో ఎందఱో పరిచయమవుతారు కానీ కొందరే ప్రభావితం చేయగలుగుతారు 
సీత మహాలక్ష్మి గారిలా 
పెట్టుపోతలు లేకున్నా ఎటువంటి అరమరికలు లేకుండా హాయిగా మాట్లాడగలగటం కూడా ఒక ఆర్ట్ 
అది మనలో లేకున్నా ఇటువంటి వార్ని చూసి అలవర్చుకోవచ్చు 
అటువంటి వారు మన దగ్గరుంటే ఎంత బాగుండేది అనిపించింది ఆ చల్లని తల్లి ని చూస్తే  
అమ్మ వారు మిత్ర రూపిణి  చైతన్య స్వరూపిణి కదా  ఆవిడ భక్తులను ఆవిడే  కలుపుతుంది అనుకున్నాము 




    




11, జూన్ 2015, గురువారం

                               జీవితం ?
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అని తెలుసు 
'వంకరగా వున్నా కూడా నాదే' అని కుర్కురే ప్రకటనలో చెప్పినట్లు 
ఈ జీవితం ఎలా ఉన్నా నాదే 'అని ఆనందాలు దుఃఖాలు అన్ని అనుభవిస్తున్నాము 
'జరగల్సినది జరక్క్క మానదు' అని మేము పాల్గొన్న 'సిద్ధ సమాధి యోగా'లో చెప్పిన మాట 
ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకుంటూ 'ముళ్ళ కంపలు రాయి రప్పలు దాటినాను
మొండి బ్రతుకును  ఒంటిగానే మోసినాను రాగమన్నది గుండెలో రగులు తున్నది ఎందుకో 
రగిలి రగిలి నేను నేనుగా మిగిలిపోవుటకా 'అని విషాద గీతాలు మననం చేసుకుని 
నిట్టుర్చినా జీవితం సాగుతూనే ఉంది 
ఈ జీవితం నన్ను సాధిస్తోంది  ప్రశ్నిస్తోంది పరీక్షిస్తోంది సోధిస్తోంది బాధిస్తోంది విసిగిస్తోంది 
కానీ భయపెట్ట లేకపోతోంది 
ఎందుకంటే మొండివాడు రాజు కంటే బలవంతుడు కదా 
దశల వారీగా మన  ఆనందాలను లాక్కుని దుర్దశల వారీగా 
సమస్యల ప్రహేళికలు మన ముందుంచి మన ఉనికినీ మన మేధస్సుకి  సవాలు గా 
మనని ధైర్యవంతులుగా  శక్తివంతంగా మలచిన ఈ జీవితాన్ని ఏమనాలి 
మేకపోతు గాంభీర్యముగా లో లోన  గుండెలో అగ్నిపర్వతాలు ప్రజ్వరిల్లుతున్నా 
కోటి వెతలు మనసుని క్రుంగ దీస్తున్నా ఎన్నో  భయాలు ఎదను తొలిచేస్తున్నా
ముఖం లో దరహాసం ఉంటే చాలు 'రేసుగుర్రం' సినిమాలో 'శ్రుతి హాసన్' లాగా 
నవ్వు, భయం ,కోపం, అన్నీ లోపలే   సమయం దాని పని అది చేసుకుపోతుంది 
ఫలితం ఏదయినా తప్పదు కదా అనుకొంటే చాలు
 స్థితప్రజ్ఞులు అనిపించుకోవచ్చు   
  

4, జూన్ 2015, గురువారం

                  అపురూపం +అనుభూతి 

నా చిన్నప్పుడు మాకమలపిన్ని (అసలు కి అమ్మక్కయ్యే 
కానీ మా ఇంకోఅమ్మక్కయ్య పిల్లలు అలా పిలిస్తే నేను కూడా అలాగే పిలిచేదాన్ని )
వాళ్ళ వూరు కాకిలేరు మా పెద్దనాన్న గారు అ ఊరికి కరణం గావుండేవారు
 వాళ్ళకి నలుగురమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అక్కడికి 6మైళ్ళ దూరం వడలి
అక్కడ  మా మాతా మహులు అయ్యగారి సత్య నారాయణ మూర్తి గారు కరణం గాఉండేవారు 
అక్కడ నేను 5వక్లాస్ దాక చదువుకునే రోజుల్లో ప్రయాణాలు సినిమాలు అంటే తెగ పిచ్చిగ ఉండేది  
అక్కడ అమ్మమ్మ గారింటిలో హైమవతి అమ్మక్కయ్య పిల్లలు నేను కలిసి 
సెలవులకి కాకిలేరు వెళ్ళే వారము 
 ఈ రోజులల్లో తమ పిల్లలని చూసుకోడమే కష్టమని అనుకుంటున్నారు 
కానీ అప్పట్లో ఎ బేదాలు లేకుండా అక్కచెల్లెల్ల పిల్లలని అన్నదమ్ముల పిల్లలని 
చూసుకునేవారు
 అందుకే పెళ్ళిళ్ళకి వేసవి సెలవులకి   సుమారు 20 30 మంది మనవలు మనవరాల్లతో
 ప్రతి లోగిలి కళకళ లాడేది 
అప్పట్లో ఆ ఊరికి బస్ వుండేది కాదు ఎడ్లబండి రిక్షా  లేదా 3 కిలో మీటర్ల నడక 
అ వూరు వెళ్ళాలంటే ఇష్టం మా కమల పిన్ని చేసే రకరకాల చిరుతిళ్ళు తినడం 
చెరువులో కలవ పూలకి వెళ్లడం గోరింటాకు మల్లెపూలు పెనుగొండ లో కన్యకాపరమేశ్వరి గుడికి 
వెళ్ళడం మినర్వా ప్యాలెస్ దియేటర్ లలో సినిమాలు చూడటం అంత త్రిల్లె మాకు 
 పక్కింటి మాదా సత్యం ఇంట్లో పాడే గ్రామఫోన్ రికార్డ్సు వాటికీ మా డాన్సు లు 
 సూరిబాబు అన్నయ్య చదివే డిటెక్టివ్  పుస్తకాలు అన్ని ఎంతో నచ్చేది 
ఒక విషయం లో భయముగా ఉండేది అదేమిటి అంటే ఆ ఊర్లో కరెంట్ ఉండేది కాదు 
స్నానం కి పర్వాలేదు కానీ కొన్ని అవసరాలకి పుంత ల్లోకి  వెళ్ళాల్సి వచ్చేది 
అది కూడా ఎవరో ఒకరి సహాయంతో రాతిరిల్లు ఎ అవసరాలు రావొద్దు దేముడా అని 
దేముడికి మొక్కుతూ వుండేదాన్ని కానీ
ఆ భయానికి ఎవరికీ రాని అవసరాలు నాకే వచ్చేవి (హహహ )
ఇప్పుడయితే నవ్వొస్తోంది పాపం మా కమల పిన్ని రవివర్మ చిత్రంలోలా లాంతరు 
తీసుకుని నన్ను తీసుకెళ్ళేది అ ఇంట్లో     
అన్నింటిలోకి నాకు బాగా నచ్చిన వస్తువు ఒకటుండేది అదేమిటంటే 
మా పెదనాన్నగారు మంచినీళ్ళు తాగే స్టీల్ గ్లాస్ అది నచ్చి
 అందులోనే పాలు  తాగుతానని నీళ్ళు తాగుతానని పేచీ పెట్టేదాన్ని 
అది మా పెదనాన్నకే ప్రత్యేకం అని నాకు కూడా అలాంటిది  కొనిస్తానని ఊరుకో పెట్టేవారు
 ఎప్పటికయినా నీకే ఇస్తాను అని చెప్పేది మాకమల పిన్నిఅ మాటకి వాళ్ళ పిల్లలు కూడా 
అవును కామేశ్వరి కె ఇవ్వు దానికి భలే ఇష్టం అ గ్లాస్ అంటే అనేవారు 
అలాగే ఈ మద్య మా పెదనాన్న కాలం చేసారు
 అయన గుర్తుగా అగ్లాస్ మా ఇంటికోచ్చేసింది దాని చూస్తే నా బాల్యం గుర్తొస్తుంది 
నా ఇష్టాన్ని గుర్తు పెట్టుకొని నాకిచ్చిన అ వస్తువులో మా వాళ్ళ ప్రేమ కనిపిస్తుంది 

Monday, October 22, 2012

alu parotha

                                               మూలి పరోట 

 కావలసినవి 

గోధుమ పిండి   అర  కిలో 

ముల్లంగి దుంపలు 3 తురిమి నీరు తీసేయాలి 

ఆనియన్             2   

పచ్చి మిర్చి          4

కొత్తిమీర       ఒక కట్ట

సాల్ట్                   తగినంత 

ఆయిల్ కానీ నేయి కానీ బట్టర్ కావలసినంత  

 వీటన్నింటిని సన్నగా ముల్లంగి తురుములాగే సన్నగా తరగాలి 

చేయు విధానం ----  ముందుగా గోధుమ పిండిలో కొంచం నీరు సాల్ట్ వేసి కలిపి వుంచుకొని కొంచెం పెద్ద గా ఉండలు చేసి పెట్టుకోవాలి 

తర్వాత తుర్ముకున్న ముల్లంగి ఉల్లి పచ్చిమిర్చి కొత్తిమీర  సాల్ట్ ని బాగా కలుపుకొని గోధుమ పిండి  ఉండను ఒక బౌల్ లా  చేసి అందులో ఈ ముల్లంగి మిశ్రమాన్ని పెట్టి  మొత్తం క్లోజ్ చేయాలి వీటిని పలుచని  ప్లాస్టిక్ పేపర్  మధ్యలో పెట్టి పైన ఇంకో పేపర్ పెట్టి వేళ్ళతో గుండ్రంగా పల్చగా వతుకోవాలి తర్వాత నేయి తో కానీ వెనతో కానీ పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి  ఇవి గడ్డ పెరుగుతో తింటే చాల బాగుంటాయి ఇలాగే  ఆలు గోభి  మేతి పరోటాలు చేసుకోవచ్చు వీటికి దేశి ఘీ వాడితేనే టేస్ట్ బాగుం