వర్షం తో నేను
ఆకాశం లో మెరుపులు
నా నయనాల కాంతుల్లో చిందుతాయి
నా నయనాల కాంతుల్లో చిందుతాయి
మేఘాల్లో వర్ష ధారలు భూమికి అభిషేకం
నా మాటల ధారలో నీకు నాప్రేమాభిషేకం
నా మాటల ధారలో నీకు నాప్రేమాభిషేకం
అప్పుడప్పడు ఉరిమే ఉరుములు
నా అలకలో ని తీపి శాపాలు
నా అలకలో ని తీపి శాపాలు
గుండె అదిరేలా పడే పిడుగులు
నా మౌనం లో నీ గుండెలయలు
నా మౌనం లో నీ గుండెలయలు
వానలొస్తే అవనికి సస్య శ్తామలం
వలపువానలొస్తే బ్రతుకే నిత్య కల్యాణం
వలపువానలొస్తే బ్రతుకే నిత్య కల్యాణం
తుపాన్ వస్తే లోకమే భయానకం
వియోగమొస్తే మనిషికే విషాదకరం
వియోగమొస్తే మనిషికే విషాదకరం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి