24, అక్టోబర్ 2012, బుధవారం
23, అక్టోబర్ 2012, మంగళవారం
బాద్యతలు తీరిన వయసులో భాగస్వామి లేని బ్రతుకు
భావ శూన్యత నిండిన ఎదలో అనుభవాలఊసులు
బాధా తప్త మది గది లో జ్వాలలు రేపుతుంటాయి
చేసిన త్యాగాలు వదులుకున్న మమకారాలు
వర్తమానాన్ని వెక్కిరిస్తాయి ఏమి సాధించావని
నిరంతరం ప్రశ్నిస్తాయి నిన్నులోలోనే దహిస్తాయి
భావి మనుగడ భుక్తి తోనే ముక్తి అని గుండెని దొలుస్తాయి
నీ తీరని కోరికల సమాధులలో నీ అస్థిత్వం నిక్షిప్తమవుతుంది
నీ భావావేశాలు పంచుకోలేక దిగ మ్రింగుతూ
తరలిపోయిన నీ సంతోషాలను నెమరు వేస్తూ
కోల్పోయిన వాళ్ళ కోసం రోదిస్తూ ఎన్నాళ్ళు ఈ జీవితం?మిగిలిందేమిటి పరమార్ధం
22, అక్టోబర్ 2012, సోమవారం
alu parotha
మూలి పరోట
కావలసినవి
గోధుమ పిండి అర కిలో
ముల్లంగి దుంపలు 3 తురిమి నీరు తీసేయాలి
ఆనియన్ 2
పచ్చి మిర్చి 4
కొత్తిమీర ఒక కట్ట
సాల్ట్ తగినంత
ఆయిల్ కానీ నేయి కానీ బట్టర్ కావలసినంత
వీటన్నింటిని సన్నగా ముల్లంగి తురుములాగే సన్నగా తరగాలి
చేయు విధానం ---- ముందుగా గోధుమ పిండిలో కొంచం నీరు సాల్ట్ వేసి కలిపి వుంచుకొని కొంచెం పెద్ద గా ఉండలు చేసి పెట్టుకోవాలి
తర్వాత తుర్ముకున్న ముల్లంగి ఉల్లి పచ్చిమిర్చి కొత్తిమీర సాల్ట్ ని బాగా కలుపుకొని గోధుమ పిండి ఉండను ఒక బౌల్ లా చేసి అందులో ఈ ముల్లంగి మిశ్రమాన్ని పెట్టి మొత్తం క్లోజ్ చేయాలి వీటిని పలుచని ప్లాస్టిక్ పేపర్ మధ్యలో పెట్టి పైన ఇంకో పేపర్ పెట్టి వేళ్ళతో గుండ్రంగా పల్చగా వతుకోవాలి తర్వాత నేయి తో కానీ వెనతో కానీ పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి ఇవి గడ్డ పెరుగుతో తింటే చాల బాగుంటాయి ఇలాగే ఆలు గోభి మేతి పరోటాలు చేసుకోవచ్చు వీటికి దేశి ఘీ
24, జూన్ 2012, ఆదివారం
భావావిష్కరణ
'నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన |
'ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన |
'అన్నారు ఒక కవి.
'కాని' ' ప్రతివారికి ప్రతి మనిషి తో, పరస్పరం ఏర్పడే, అనుబంధాల మాటేమిటి? చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే, మొదటి గీత చిన్నదయినట్లు, ఒక బాధ నుండి, మరో బాధని పోల్చుకుని, నిట్టుర్చడమేనా ?
'ఏ రిలేషన్ ని కోల్పోయినా కోలుకోడం చాలా కష్టం.
ముఖ్యంగా జీవిత భాగస్వామిని కోల్పోవడం, ఒక చెలిమిని పోగొట్టుకోడమే |
'మరణం తప్ప విడదీయని స్నేహం' భార్య భర్తల అనుబంధం | కలిసి పుట్టక పోయినా, కల కాలం కలిసి ఉండాలని ఆశ| 'కాని దేముని నిర్ణయాలు వేరు|
'అయన దృష్టి లో అందరు సమానమే |భోగ భాగ్యాలు, సుఖ దుఖాలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఏవీ మన ప్రమేయం కాదో, అలాగే 'జనన మరణాలు 'కూడా అయన నిర్దేసితమే| అందుకే, 'అందరం ముందో, వెనకో, వెళ్ళాల్సిన వాళ్ళమే|'ఈ 'బ్రతుకు ప్రయాణము'లో, అనుకుని, వేదాంత ధోరణి అలవర్చుకుని, మనుగడ సాగించాల్సిందే|
'అయితే ఒక మాట మానవత్వం గురించి తప్పక చెప్పుకోవాలి |
'మనిషి కి అన్ని కష్టాలలో భయంకరమయిన కష్టం ఆత్మీయులని పోగొట్టుకోడం. 'అటువంటి కష్టాలు వచ్చి, కుంగి పోయిన కుటుంబానికి, 'ఆ క్షణం లో చేయూతనిచ్చి, జరగవలసిన కార్యక్రమానికి ,తగు ఏర్పాట్లు చేసి, భయాలు, సెంటిమెంట్స్ లేకుండా, వెన్నంటి చేయించడం,చాలా గొప్ప మనసున్న వారికే సాధ్యం | 'నీ' 'నా' బేధం లెకుండా, అందరికీ తలలో నాలుకలా ఉండటం, ఒక 'రామారావు' ఒక 'యన్ వి రావు' ఒక 'స్వామి' లాంటి వారికే సాధ్యం |
'తీరని దుఃఖం తో నిద్రాహారాలు లేకుండా, ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చి ,ఎన్నో రకాలుగా స్వాంతన పర్చి, మరల వారు వారి దైనందిన చర్యలలో, నిమగ్నం అయ్యేంత వరకు తోడ్పడే, 'బంధు మిత్రులను' ఎప్పటికి మర్చిపోలేరు.ఆ యా కుటుంబ సభ్యులు |
అయితే మరి కొందరుంటారు. 'బాధలో' ఉన్న వారిని చూసి, భయ పడుతుంటారు . బాధలో ఉన్న వారి చెంతకేడితే. అవి వారికీ వస్తాయేమో| అని భయం. వాళ్ళని చూసి జాలి పడటం తప్ప, ఏమి చేయలేము. బాధలన్నవి 'అంటు వ్యాధి' కావని, అవి తెలీని వారని అనుకోడం తప్ప, ఏమీ చేయలేము.
'జంట ఎడబాసిన పక్షి కంట పొంగిన గంగ |
'తన కంట ఉప్పొంగగా| మనసు కరుగంగా|
'ఆ శోకం లో ఒక శ్లోకం పలికే| అన్నట్లు గుండెలో భావాలన్నీ
ఇలా అవిష్కరించుకోడం తప్ప, మరేమీ చేయగలను ?
20, జూన్ 2012, బుధవారం
ఒంటరి ప్రయాణం
ఏమిటి ఈ జీవితం?
పెళ్లి అనే పేరుతో రెండు జీవితాలను కలిపి, జంటగా ప్రయానించాము సంసార కష్ట సుఖాలను కలిసి ఎదుర్కున్నాము , జీవిత చరమాంకంలో సేద దీరే వేళ, అన్నింటిని జయించినామని తృప్తి పడే వేళ, ఊహించని ఉపద్రవం లా, చెంతనున్న తోడు లేకుండా పోతే, ఒంటరిగా మిగిలాను. విరామం లేకుండా సమాప్తం అయి, ఇలా ఒంటరిగా మిగిలిన నేను ఏమి చేయాలి? పోయినోళ్ళు అందరు మంచి వాళ్ళే వున్న నాలాంటి వారే నిర్భాగ్యులు. అసలు దేముడు ఇలా జంటని విడదీసే కన్నా ఇద్దరినీ ఒకసారే తీసుకు పోవచ్చు కదా| పెళ్లి పిల్లలు ఒక బంధం.కనిపించని కళ్ళాలు మనిషి కి. మంచి జీవిత భాగస్వామి ఉన్న వారెవరు, వాటినీ తెంచుకుని వెళ్ళలేరు. అన్ని అటుపోటులు దాటుకుని ఏటికి ఎదురీది విధి చేతిలో ఓడిపోయి, జీవిత భాగస్వామి ని పోగొట్టుకుని , సమాజానికే సానుభూతిగా మిగిలి బ్రతికున్న శవం లా ఎన్నాళ్ళు బ్రతకాలి?
' థాంక్ గాడ్ 'అయిన వాళ్ళు అందరు ఛాందసులు కారు నాకొచ్చిన కష్టానికి తల్లడిల్లారు మళ్ళి నేను ధయిర్యంగా మాములు రొటీన్ లో పడాలనే ఆకాంక్షించారు.అంతే కానీ నేను నమ్మని వైధవ్యాన్ని నాకు అంట గట్టలేదు. ఈ లోటు ని బ్రతికినంత కాలం మోయగలను. ఆ జ్ఞాపకాలు అయువునున్నంత కాలం నెమరు వేసుకుంటాను నా వారి కోసం దుఖం దిగమింగి బ్రతుకు బాటలో ఒంటరి ప్రయాణం సాగిస్తాను.తప్పదు ఇది హాలాహలం స్వీకరించక తప్పదు నాలా ఎందఱో అందరిలానే నేను
ఆ నావ వెళ్లి పోయింది ఆ ఒడ్డే చేరి పోయింది
అట్టాగే వెళ్లి పోయేనా నన్నిడిసి వెళ్లి పోయెనా
3, ఫిబ్రవరి 2012, శుక్రవారం
నోబెల్ అవార్డ్ వచ్చిన ఈ పాట వినని తెలుగు వారుండరు
చక్కని తెలుగు పదాలతో అల్లిన సాహిత్య రత్నం శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఈ పాట విన్నప్పుడల్లా తెలుగు వారమైనందుకు మనసు గర్విస్తుంది ఆ పాట మీకోసం
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్ల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది
1 రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
సున్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకూ రాలు అడవికి ఒక అమని దయ చేసింది
1 విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడి అంతలోనే పోయాయి
గగనంలో మబ్బుల్లారా రేవుల్లో నావల్లారా
నది దోచుకుపోతున నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి
నావకి చెప్పండి ఈ పాటలోని విషాదం గుండెని పిండేస్తుంది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)