14, డిసెంబర్ 2013, శనివారం

నిన్న ఒక థ్రిల్; ఎప్పుడో సుమారు ముప్పయి అయిదు సంవత్సరాల క్రితం, నరసాపురం లో నాతో కలిసి ఆడుకున్న, స్నేహితురాలు ఉషా రాజేశ్వరి  నన్ను గుర్తు పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చింది. 
' ఆనందం తో నిజంగా కన్నీళ్లు వచ్చాయి.  అప్పుడు నాకు కల్లా కపటం తెలీదు బ్రతుకు బాధలు తెలీవు  'బ్రతుకు బాటలో పూల తోపాటు రాళ్ళూ ముళ్ళు అంతరంగంలో ఆనందాల తో పాటు, అగ్నిగుండాలు 'దూషణ భూషణ తిరస్కారాలు' అన్ని అనుభవించి బండ బారిన మనసులో, అప్పటి జ్ఞాపకాల హేల నాకొక సంతోషం కలిగించింది.  
పెళ్లి తో విడిపోయి, మనవలను ఎత్తాక కలుసుకుంటే, 'ఇంత జీవితం ఇన్ని అనుభవాలు ఎలా పంచుకోవటం?'
స్కూల్ ఫ్రెండ్స్ క్లాసు మేట్స్  బెంచ్ మేట్స్ కాకుండా సెలవులలొ ఆడుకున్న ఫ్రెండ్ కూడా కలవటం రియల్లీ హార్ట్ టచ్చింగ్. 
 బాల్య స్నేహితులు ఫామిలీ ఫ్రెండ్స్ కాలనీ స్నేహితులు పరిచయాల ద్వార ఏర్పరచుకున్న క్లోజ్ ఫ్రెండ్స్ వుండటం నా అదృష్టం అనిపించింది.  నా' ప్లస్ అండ్ మైనస్' షేర్ చేసుకోటానికి  ఆర్ధిక అసమానతలు కుల గోత్రాలు స్నేహ బంధానికి అడ్డురావని అందరికీ  తెలుసు. 
  సహాయం చేసినా చేయకున్నాసాటి వారి భావాలను ఇష్టాలను వ్యక్తిత్వాన్నిచంపేయాలని చూడరు.నిర్దేశించాలని శాసించాలని చూడరు.  అందుకే స్నేహితులంటే నాకు ప్రాణం' ఆర్ధిక అసమానతలు శాసించనిదేమైన వుంది అంటే అది ఒక స్నేహమే బంధువులు మనం బాగుండాలి అని కోరుకుంటారు బాగుంటే సంతోషిస్తారు బాగుండకపోతే సహాయాలు చేస్తారు
 కాని  ఏదో రకంగా మన పరిస్థితులకు మన్నే ఆపాదిస్తారు కారణాలు వాళ్ళే చెప్పేస్తారు తెలివి  లేకపోడం ప్లాన్ చేసుకోపోడం దుబార చేసుకున్నరానో ఏదో మన మొహాన్నే అనేస్తారు మనం నోచ్చుకోకూడదు  నొచ్చుకుంటే విశ్వాస ఘాతకులనే  పేరు మోయల్సిందే స్నేహితులు హితంగా చెప్తే బంధువులు విమర్శగా చెప్తారు అదీ తేడా ఏది ఏమయినా స్నేహం మన  ఎంపిక అందుకే దాన్ని కాపాడుకోవాలి 

2, డిసెంబర్ 2013, సోమవారం

          'పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు'
          'మళ్ళీ తన మనిషి ఒడిలోకే చేరు '
           అని ఎదురుచూసినా     
          'రెప్పనై వుంటాను నీ కంటికీ' 
          'పాపగా వస్తాను నీ ఇంటికీ'అని,చెప్పారనుకుని              భ్రమ పడినా  
          నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ'
          మనసొక్కటే కలిసున్నది  ఏనాడైనా
          ఉండి కూడా  వున్నది నీవే 
          ఉన్నా కూడా లేనిది నేనే'
          అని వేదన పడినా 
         'ఇన్ని వేల చుక్కల్లో నిను నే వేతికేనే'
          అని ఎంత వెతికినా దొరకరని రోదించినా 
          'ఉన్నా నేను నీలోనా' నీకుతేలుసునా? 
          అసలుందో లేదో నా ప్రాణం, నీకు దూరమయి                 బ్రతకగలనా'
          అని భయపడినా
          జరిగిన  ఘోరానికి సాక్షిగా మిగిలిన                             వారు అనుక్షణం మాటల్లో పాటల్లో పోయిన                   వారినే స్మరిస్తూ జ్ఞాపకాలు 
          నెమరు వేస్తూ పోయినోళ్ళ తీపిగుర్తులుగా                    ' మనుగడ మరణ శాసనమయి, 'గుండె లోతుల్లో           గునపాల పోట్లుగా,' గతం స్వగతమయినా.                   కళ్ళు నీళ్ళు లేని కాసారమయినా 
         'వెన్నెలలెంతగా విరిసిన కానీ                                     చంద్రుణ్ణివిడిపోలేవు.  
          'కెరటాలేన్తగాఎగిసిన కానీ                                         కడలినివిడిపోలేవు.   
          'తనువులు వేరైనా.  దారులు వేరయినా,
          'ఆ బంధాలే నిలిచేనులే. అన్నట్లు పోయిన వారి              అనుబంధమే ఆలంబనగా అశువులు బాసె                  దాకా జేవితాన్ని నడిపించాలి          

18, నవంబర్ 2013, సోమవారం

పెద్ద గీత దగ్గర ఇంకో పెద్ద గీత రాస్తే గీత చిన్నదవుతుంది.అలాగే ఇంకొకరికొచ్చిన కష్టం ముందు మనకొచ్చిన కష్టం చిన్నగా అనిపిస్తే ?
చాల వైరాగ్యం నైరాశ్యం కలుగుతాయి. ఏమిటీ జీవితం ? 
ఏమి వింటున్నాము? ఏమి చూస్తున్నాము?అని ఆక్రోశం   కలుగుతుంది.  మన చేతిలో ఏమీ లేదాఅనిపిస్తుంది        తెలివితేటలు డబ్బుహోదా అధునాతనమయిన               వైద్య సదుపాయాలు ఉన్నాకూడా ఆత్మీయులని             కాపాడుకోలేని ఆశక్తులుగా మిగిలిపోతున్నాము. 
మనకొచ్చిన కష్టానికి కలిగే బాధ కన్నా మనకన్నాచిన్నవాళ్ళ కొచ్చిన కష్టానికి తట్టుకోవడం
ఓదార్చడం ఎవరి తరం కాదు. 
ఇది వరకు జబ్బులకు మరణానికి ముదిమి వయస్సు 
కారణంగా వుండేది.  కానీ ఇప్పుడు నడివయస్సు కూడా 
రాకుండానే చనిపోతున్నారు.  ఆకస్మిక మరణం ప్రమాదాలలో దుర్మరణం బలవన్మరణం కారణాలు  ఏమైతేనేమి మనుషులని కోల్పోతున్నాము.   మనుషులకు నూరేళ్ళు ఆయుర్దాయం రాసిన దేముడు
 తన మాటని తనే మర్చిపోయాడ?  అల్పాయుష్కులుగా  తీసుకెళ్ళిపోతున్నాడు.    
 భద్రత లేని బ్రతుకయిపోతోంది అని అనుక్షణం  భయంతో  సందేహాలతో బ్రతుకుతున్నాము.ఇలాంటి  సందర్భాలలో ఎవరి నోట విన్న  భగవంతుడా ఇటువంటి  కష్టాలు పగవారికి కూడా  వద్దుఅని మొర పెట్టుకుంటున్నారు.అవి ఆలకించు  ఇచ్చిన జీవితం సంపూర్ణంగా జీవించనివ్వు  దేముడా  ఇదే నా ప్రార్ధన         

10, ఏప్రిల్ 2013, బుధవారం

                                         గతం -స్వగతం 





                     
  •  ప్రతి పండుగని ఆనందంతో జరుపుకోవాలనే భార్యాభర్తల  కోరిక.పండుగలు, భార్యకి పిల్లలకి వాళ్లకి కావలసినవి కొనివ్వాలని జీవితాంతం అభిలాషిస్తాడు మగాడు.  వేడుకలు,తాము బాగా చేసుకోవాలి.  తమ 'కుటుంబం' ఆనందం లో వోలలాడాలనే, కోరుకుంటారు ఇద్దరు. 
  •  అదే  'తాపత్రయం' తో ఇంటిని అలంకరించుకుని, ఒంటిని సింగారించుకుని, ఉత్సాహం తో ఉరకలేస్తూ, శ్రమ తెలియకుండా,   'సాక్షాత్తు మహాలక్ష్మిలా' కళకళలాడుతూ 'అన్నపూర్ణా దేవిలా', అందర్నీ ఆదరిస్తూ,ఎన్నో దశాబ్దాలు, వుక్కిరిబికిరి అవుతూ, తన ఉనికి తో పర్యావరణాన్ని, ప్రభావితం చేసిన ఇల్లాలు, ఈ వేడుకలకి అతీతంగామారింది. ఆ ఇల్లు నిశ్శబ్ద ఏకాంతమయింది.  అంటే రెండే కారణాలు.  ఒకటి మరణం, రెండు భాగస్వామి ని కోల్పోవడం.

  •   ఈ రెండు కారణాల లో మరణమే బెటర్.పోయాక ఏమవుతామో  ఎవరికీ తెలీదు.కాని జీవిత కాల మిత్రుడు భర్త/భార్య ని  కోల్పోయి, కుటుంబంలో జరిగే  సంతోషసందోహాలలో, ఇమడలేక, ఏ రకంగా ఉండాలో అర్ధం కాదు. అయోమయ పరిస్థితి.

  •   మనసులోఖేదంతోఎక్కడికీ పోలేరు.నిబ్బరంగా వున్నట్లు ఆస్కార్ కి మించిన అవార్డ్   పొందేంత నటన ప్రదర్శిస్తూ. కోకిలల కుటుంబంలో చెడ   బుట్టిన కాకి లా ఒంటరి ఏకాకిలా,దురదృష్టానికి చిరునామాలా మనుగడ సాగించడం ఒక పరీక్ష 

  • తమలాగా, ఎందరో ఉన్నారు.    ఏమి చేస్తాము?  ఖర్మ అనుభవించక తప్పదు. ఇలాంటి బాధ ఎవరికీ వద్దు.అనుకోవడమే 
  •    ఆ దేముని దయ వలన 

  •  'సర్వే  జనా సుఖినోభవంతు
  •  సర్వే జనా శాంతిర్భావతు
  •  సర్వేజనా మంగళం భవతు 
  •  సర్వే జనా పూర్ణం భవతు  
  •  లోకా సమస్తా సుఖినోభవంతు