9, డిసెంబర్ 2011, శుక్రవారం

                           స్వీట్ మెమరీ    
ఉదయపు వేళ, ఎప్పుడైనా ఆరు గంటలకు, మనసులో 'మెరుపులా' గుర్తొచ్చే 'స్వీట్ మెమరీ' వైజాగ్ నుండి వచ్చే గోదావరి ఎక్స్ ప్రెస్ లో అమ్మానాన్నగారి రాక కోసం, ముందు రోజు రాత్రి నుండే, ఎదురుచూపులు. త్వరగా కాఫీ  డికాక్షన్ తీసి, పాలు కాచేసి,
ఆటో శబ్దం కోసం ఎదురు చూస్తూ  వుండటం ఒక తీయని అనుభూతి.
చాల మంది పిల్లలకి, 'తండ్రి' కేవలం తండ్రి మాత్రమే కాదు కష్టం, సుఖం, ప్లస్, మైనస్, అన్ని షేర్  చేసుకోగలిగే,  స్నేహితుడు. తప్పు చేసినా, సున్నితంగా హెచ్చరించే మార్గ దర్శకుడు. తమ పిల్ల్లల ఉన్నసద్గుణాలని మెచ్చుకునే ఏకైక ఆప్తుడు. 'తల్లి ప్రేమ' సరే, సరి. పిల్లల దగ్గరకు వెళ్ళాలి ,అనుకోగానే, ఎవరికీ ఏమిస్టమో' ఆ రకంగా 'ఏమైనా చేసి,తీసుకు రావాలి' అన్నతపనతో ఏవేవో చేసి తీసుకు వచ్చేది.తల్లితండ్రులు ఏమి తెస్తారు?అన్నఆత్రం పిల్లలకి  వుండదు. 'కానీ' మనవలు మనవరాళ్ళకి మాత్రం తెచ్చినవి చూపిస్తేనే కానీ స్కూల్ కివెళ్ళాలి అని వుండదు అలాఅమ్మమ్మ తాతయ్య రాగానే, ఇదే కాలనీ లో ఉన్న, మా చెల్లెలు 'పద్మ'కి ఫోన్ చేసి  అమ్మవాళ్ళు వచ్చారు నువ్వు వచ్చేయి అని పిలవడం, అది ఎక్కడి పనులు అక్కడే వదిలి, వచ్చేయడం యింక సందడే సందడి. దాని పిల్లలు, మా పిల్లలు, వాళ్ళ చుట్టూ చేరిపోయి, ఇచ్చినవి తీసుకుని, అప్పుడు స్కూల్ కి వెళ్ళేవారు.వాళ్ళుఅక్కడి విశేషాలు, ఇక్కడి విశేషాలు, కలపోసుకుంటూ 'కాఫీ' లు 'టిఫిన్లు' తో పాటు ఆ సందడి అలా కొనసాగేది అలా కన్నవారి ప్రేమానురాగాలు అనుభవించడం ఎంతో అదృష్టం 'కానీ' అలా జంట పక్షులు లాగ ఇద్దరు ఒకరికి ఒకరు తోడు గా, ప్రయాణం చేసి, పిల్లల దగ్గర కు వచ్చేవారు.అందులో ఎంతో ఆనందం వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ట్రైన్ ఎక్కించటానికి వెళ్లినా బాధ అనిపించేది కాదు  కానీ నాన్న గారు పోయాక అమ్మ ఒకత్తి ప్రయాణం చేస్తుంటే గుండెలో ఎంతో బాధ.పిల్లలం ఎందరున్నా ఒంటరి పక్షిలా శారీరక బాధలు మానసికంగా ఒంటరితనం, అనారోగ్యాలు,ముందు భవిష్యత్ పిల్లలదగ్గరే వుండాలి అన్నభావాన్ని  జీర్ణించుకోలేక,బాధ పడుతుంటే, లోలోపల బాధ అనిపిస్తుంది,ఎవరికైనా ఇంతేనా అనిపిస్తుంది. అందుకే గడచిన కాలమే, ఒక 'స్వీట్ మెమరీ' గా రోజు గుర్తు చేసుకుంటూ వుంటాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి