పేరులోనే 'డర్టీ'
నిజంగా పేరు చూసి సినిమాకి వెళ్ళాలంటే ఇబ్బంది గా అనిపించింది. కానీ, 'విద్యా బాలన్' అంటే ఉన్న 'ఇష్టం' పోయిన 'సిల్క్ స్మిత' పైన ఉన్న సానుభూతి, ఆ సినిమా చూసేలా, ప్రేరేపించాయి.లోగడ 'రేఖ ఆస్థా' 'టాబు అస్తిత్వ్' చాందిని బార్' 'షబానా అజ్మి మండి' చూడాలని అనిపించినపుడు కూడా ఇదే పరిస్థితి, ఆ సినిమాలు చూసాక ఆ ,యా డైరెక్టర్స్ కాన్సెప్ట్ అర్ధమయి, అర్ధవంతమయిన సినిమాలు చూసే వారి కోవలో, మేము వున్నాము. అనే సంతృప్తి కలిగింది.
ఒక 'స్త్రీ' సినిమా నటి కావాలన్న తపనతో, తన పరిధులన్నీ,అధిగమించి తను కోరుకున్న లక్ష్యాన్ని సాధించినా, తమకు, ఎదురు తిరిగినందుకు,ఆమెని డర్టీ గా చూపించి.సొమ్ము చేసుకొన్న వారు, అన్నినిరసనలు విమర్శలు ఆమె కే ఆపాదిస్తారు.నటనకు,
అవకాశాలు రాకపోవడం.ఇండస్ట్రి లో అందరి నిరాదరణ, ఆర్ధిక ఇబ్బందులు, ఒంటరితనం, ప్రేమ రాహిత్యం, ఎవరినైనా 'ఎంత వేధిస్తాయో' అవన్నీ ఆత్మ హత్య కు పురిగొల్పడం చాలా సహజంగా చిత్రీకరించారు ఈ సినిమాకి మూలం 'సిల్క్ స్మిత' జీవితం అన్నారు.కానీ ఇలాంటి అభాగినులు ఎందఱో,అనిపించేలా వుంది ఇటువంటి పిక్చర్ ని ధైర్యంగా ప్రోడ్యుస్ చేసిన ఏక్తా కపూర్ అండ్ శోభా కపూర్ ని అభినందించాలి అన్ని పక్కకి పెడితే నా ఉద్దేశ్యంలో, 'విద్యా బాలన్' కు అవార్డ్ రావాలి. అంత గొప్పగా కేరెక్టర్ లో ఇమిడి పోయింది.ఇది నా అభిప్రాయం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి