ఈ మాట ఎవరన్నా అది నిజం" ఎందుకంటే కొందరి మాట తీరు చూస్తే
వీళ్ళు ఇక మారరా? అనిపిస్తుంది అటువంటివారి ఎంత దూరంగా వుంటే
అంత మంచిది అనిపిస్తుంది
వారికీ తెలిసినదే వేదమన్నట్లు వితండవాదం అవతలి వారి మాట పూర్తి కాకుండానే వాదన చేసేవారు వయసుతో కానీ వరసతో కానీ పని లేదు వాళ్ళ సెంటిమెంట్స్ అందరి మీద రుద్దుతు అదే విజ్ఞానం
అన్నట్లు విషయాల పట్ల సరి అయిన అవగాహనా ఉన్నా లేకున్నా అందరితో గొడవలు పెట్టుకుంటూ
ఉండే వారు ప్రతీ వారినీ ఎదిరిస్తూ అదిలిస్తూ ఉచిత సలహాలు ఇచ్చేవారు
అన్ని చోట్ల అన్ని విషయాలలో తమకే ప్రాధాన్యత ఉండాలి అందరి కన్నా
తమకే అన్ని తెలుసు అందరు తమనే సంప్రదించాలి అని ప్రత్యేక గుర్తింపు కోసం తహ తహ లాడే వారు ఇలా కొన్ని దశాబ్దాలుగా అలాగే ఉన్నారు
వింత ఏమిటంటే ఇటువంటి వారికి తాము అందరికీ సహాయం చేసినా తామంటే ఎవరికీ ప్రేమ లేదు లక్ష్యం లేదు అనుకుంటారు కానీ తమ మాట తీరు మార్చుకోరు
పెద్దవారి పట్ల గౌరవం ప్రేమ వినయం నమ్మకం అని ఉండాలి వారు చాదస్తమో వారికున్న అపారమయిన అనుభవమో రంగరించి చిన్నవాళ్లకి చెప్తుంటారు సలహాలు ఇస్తుంటారు ఏదైనా తప్పనిపిస్తే కేకలేస్తారు అవన్నీ చేయటానికి వాళ్ళకి అధికారం ఉందనుకుంటారు అ త్రుప్తి వాళ్ళకి ఇవ్వడానికి మనం ఒకింత సహనం లేదా మౌనం సంతోషమో ప్రకటిస్తే సరిపోతుంది
అంతే కానీ చెప్తుండగానే గయ్యిమండం ఎందుకు చెప్పాలి అన్నట్లు
విరుచుకు పడటం చేస్తే అ పెద్దరికం చిన్నపోతుంది అది తప్పు అని తెలుసుకుంటే మన మీద మనకే కంట్రోల్ వస్తుంది మనల్ని మన పిల్లలే ఫాలో అవుతారు ముందు ముందు మన పని అంతే అవుతుందని తెలుసుకోవాలి
చిన్న పిల్లల పట్ల వాత్సల్యం అలవర్చుకోవాలి 'కాకి పిల్ల కాకి కి ముద్దు' అన్నట్లు ఎవరి పిల్లలు వారికేక్కువ
మనం ఎంత పెట్టినా పెట్టకున్న్న సంతోషమే కాని వేరే వాళ్ళ పిల్లలని విమర్శించడం మరేవరితోనో పోల్చి చిన్నబుచ్చడం వారి తెలివితేటలకు మనం కొలబద్దలు అవాల్సిన అవసరం లేదు
మన చేతనయితే సహాయం లేకుంటే ప్రోత్సాహం ఇంతే మనం ఎవరి పిల్లలకయినా ఇవ్వ్వవలసినది అంతే కానీ
మానసికంగా వాళ్ళని బాధ పెట్టెల మాట్లాడకూడదు
అసలు ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఎలా ఉండ కూడదో ఇలాంటి వార్ని బంధు మిత్రుల లో పరిచయస్తులలో నా ప్రియమయిన శత్రువులను
చూసి వారి మాటలకు విమర్సలకు పొగడ్తలకు సానుభూతి కి చిన్న చూపు కి నేను కూడా స్పందించిపోయి
పోయి వారిలాగే నేను రియాక్ట్ అయి మనశ్శాంతి పోగొట్టుకున్నాను కాని
మరి కొందరు మహోన్నతమయిన వ్యక్తులను కూడాచూసాను
చిరునవ్వు తో పలకరించే ఒక 'యశోద ఆంటీ', మనసులో బాధలున్నా, శారీరక రుగ్మతలున్నా, ఎవరితో అయినా కలిసిపోయి మాట్లాడే,' మా అమ్మ' అవతలి వారి కోణం నుండి ఆలోచించే 'మా నాన్నగారు' ఎవరికైనా తనకి వీలైన సహాయం అందించే 'నా తమ్ముడుశ్రీను' వాడి క్రమ శిక్షణ 'ఎన్ వి రావు బావ', మరిది వరసైన 'రామారావు' అంతస్తులతో సంబంధం లేకుండా అందర్నీ ఆదరించే' విజయలక్ష్మి ఆంటీ దంపతులు' ఎంతో గొప్ప స్థాయి అన్నిటిలో వున్నా చాలా సాదాగా వుండే సున్నితంగా మాట్లాడే మిత్రురాలు నాగమణి ఇలా ఎందఱో నా మనసుని ఆకట్టుకున్నారు
వాళ్ళలో మంచి ని అలవార్చుకోడానికి అలాగే కొందరి లో కన్పించే' లౌక్యం' కక్కుర్తి 'కుళ్ళు 'స్వార్ధం' అతి తెలివి' కీర్తి కండూతి'కర్కసత్వం అసూయా[ ముఖ్యంగా పెద్ద గొంతు తో అరుస్తూ మాట్లాడే వాళ్ళంటే చిరాకు] నాకు రాకుండా వుండాలని ప్రయత్నిస్తూ వుంటాను.
వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగిర పడక
వివరింపగన్ కని కల్ల నిజమెరిగే
నేర్పరి సుమతీ అన్నట్లు
మెల్లగా నా ప్రపంచాలు నేను సృష్టించుకుని సాధ్యమయినంతగా నన్ను నేను నియంత్రించుకుంటూ నా కంటూ గిట్టని వారు లేకుండా ఉండాలని నన్ను నేను మార్చుకోడానికి రోజు ప్రయత్నిస్తాను
ఎందుకంటే నాలో నేను కని పెట్టిన దుర్గుణం ఒకటుంది ఇంకేమున్నాయో తెలియదు కానీ అదేమిటంటే
నేను చేసే పనులలో పెద్ద పెద్ద పనులు ఇంటి వి కావొచ్చు మహిళా మండలి కాని వివిధ సంఘాల లో చేపట్టే పనులు కాని సక్రమంగా అవ్వాలని తాపత్రయ పడటమే కాదు ఎవరికీ చెప్పినా అవి సరిగ్గా అవవేమో అని అన్ని నా నెత్తినేసుకుని చేయాలనుకోవటం ఇది కూడా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అని తెలిసిపోయింది
దీన్ని తగ్గించుకోవాలి ఎవరికయినా అప్పచెప్పి వాళ్ళు సరిగ్గా చేయలేకపోయిన వాళ్ళ మీద నా రియాక్షన్ ఉండకుండా ఉన్న నాలో నేనే మింగేయాలి అంత ఓపిక నాకు రావాలి అని ఒంటరి నయి ప్రతి నిముషం కల లు కంటున్నాను నిరంతరం నాలో మార్పుకి జగమంత కుటుంబం మనకి అందరితో సవ్యంగా ఉండటమే పరిణతి కదా
ఎందుకో రక రకాల వ్యక్తులను చూస్తూ మనలని మనం కరెక్ట్ చేసుకుంటూ
రిప్లయితొలగించండిపెరుగుతాము అందరం కానీ మన చుట్టూ ఉన్నవారిలో మంచైనా చెడు అయిన ఒక్కలాగే ప్రవర్తిస్తూ వుండేవారిని చూసి క్షీర నీర న్యాయం లా మంచినే మనం స్వీకరించాలి కానీ వయసుని బట్టి పరిణతి వస్తుంది అంటే కాదేమో అనిపిస్తుంది కొందరిని చూస్తే అందుకే నా మనో భావాలూ మీతో పంచుకుంటున్నాను అతిగా రాస్తే మన్నించండి