24, జూన్ 2012, ఆదివారం

                                          భావావిష్కరణ 

  'నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన |

   'ఆ  రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన |

    'అన్నారు ఒక కవి.

 'కాని' ' ప్రతివారికి ప్రతి మనిషి తో,  పరస్పరం ఏర్పడే, అనుబంధాల మాటేమిటి? చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే,  మొదటి గీత చిన్నదయినట్లు,  ఒక బాధ నుండి, మరో బాధని పోల్చుకుని, నిట్టుర్చడమేనా ?

'ఏ  రిలేషన్ ని కోల్పోయినా  కోలుకోడం చాలా కష్టం.

ముఖ్యంగా జీవిత భాగస్వామిని కోల్పోవడం,  ఒక చెలిమిని  పోగొట్టుకోడమే |

'మరణం తప్ప విడదీయని స్నేహం' భార్య భర్తల అనుబంధం |  కలిసి పుట్టక పోయినా, కల కాలం కలిసి ఉండాలని ఆశ| 'కాని దేముని నిర్ణయాలు వేరు|

'అయన దృష్టి  లో అందరు సమానమే |భోగ భాగ్యాలు, సుఖ దుఖాలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, ఏవీ   మన ప్రమేయం కాదో, అలాగే 'జనన మరణాలు 'కూడా అయన నిర్దేసితమే| అందుకే, 'అందరం ముందో, వెనకో, వెళ్ళాల్సిన వాళ్ళమే|'ఈ 'బ్రతుకు ప్రయాణము'లో, అనుకుని, వేదాంత ధోరణి అలవర్చుకుని, మనుగడ సాగించాల్సిందే|

'అయితే ఒక మాట మానవత్వం గురించి తప్పక చెప్పుకోవాలి |

'మనిషి కి అన్ని కష్టాలలో భయంకరమయిన కష్టం ఆత్మీయులని పోగొట్టుకోడం. 'అటువంటి కష్టాలు వచ్చి, కుంగి పోయిన కుటుంబానికి, 'ఆ క్షణం లో చేయూతనిచ్చి, జరగవలసిన కార్యక్రమానికి ,తగు ఏర్పాట్లు చేసి, భయాలు, సెంటిమెంట్స్ లేకుండా, వెన్నంటి చేయించడం,చాలా గొప్ప మనసున్న వారికే సాధ్యం | 'నీ' 'నా' బేధం లెకుండా, అందరికీ తలలో నాలుకలా ఉండటం, ఒక 'రామారావు' ఒక 'యన్ వి  రావు' ఒక 'స్వామి' లాంటి వారికే సాధ్యం |

'తీరని దుఃఖం తో నిద్రాహారాలు లేకుండా, ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చి ,ఎన్నో రకాలుగా స్వాంతన పర్చి, మరల వారు వారి దైనందిన చర్యలలో, నిమగ్నం అయ్యేంత వరకు తోడ్పడే, 'బంధు మిత్రులను' ఎప్పటికి మర్చిపోలేరు.ఆ యా కుటుంబ సభ్యులు |

అయితే మరి కొందరుంటారు. 'బాధలో' ఉన్న వారిని చూసి, భయ పడుతుంటారు . బాధలో ఉన్న వారి చెంతకేడితే. అవి వారికీ  వస్తాయేమో| అని భయం. వాళ్ళని చూసి జాలి పడటం తప్ప, ఏమి చేయలేము.   బాధలన్నవి 'అంటు వ్యాధి' కావని, అవి తెలీని వారని అనుకోడం తప్ప, ఏమీ చేయలేము.

'జంట ఎడబాసిన పక్షి కంట పొంగిన  గంగ |

'తన కంట ఉప్పొంగగా| మనసు కరుగంగా|

'ఆ శోకం లో ఒక శ్లోకం పలికే| అన్నట్లు గుండెలో భావాలన్నీ 

 ఇలా అవిష్కరించుకోడం తప్ప, మరేమీ చేయగలను ?  

 


        

      

 

 

 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి