20, జూన్ 2012, బుధవారం

                            ఒంటరి ప్రయాణం 

ఏమిటి ఈ జీవితం?

పెళ్లి అనే పేరుతో రెండు జీవితాలను కలిపి, జంటగా    ప్రయానించాము సంసార కష్ట  సుఖాలను కలిసి ఎదుర్కున్నాము , జీవిత చరమాంకంలో సేద దీరే వేళ, అన్నింటిని జయించినామని తృప్తి పడే వేళ, ఊహించని ఉపద్రవం లా, చెంతనున్న తోడు లేకుండా పోతే, ఒంటరిగా మిగిలాను. విరామం లేకుండా సమాప్తం అయి, ఇలా ఒంటరిగా మిగిలిన  నేను ఏమి చేయాలి? పోయినోళ్ళు అందరు మంచి వాళ్ళే వున్న  నాలాంటి వారే  నిర్భాగ్యులు. అసలు దేముడు ఇలా జంటని విడదీసే కన్నా ఇద్దరినీ  ఒకసారే తీసుకు పోవచ్చు  కదా| పెళ్లి పిల్లలు ఒక బంధం.కనిపించని కళ్ళాలు  మనిషి కి. మంచి జీవిత భాగస్వామి ఉన్న వారెవరు, వాటినీ  తెంచుకుని  వెళ్ళలేరు. అన్ని అటుపోటులు దాటుకుని ఏటికి ఎదురీది విధి చేతిలో ఓడిపోయి, జీవిత భాగస్వామి ని పోగొట్టుకుని , సమాజానికే సానుభూతిగా మిగిలి  బ్రతికున్న శవం లా ఎన్నాళ్ళు బ్రతకాలి? 

' థాంక్ గాడ్ 'అయిన వాళ్ళు అందరు ఛాందసులు కారు నాకొచ్చిన కష్టానికి తల్లడిల్లారు మళ్ళి    నేను ధయిర్యంగా మాములు రొటీన్ లో పడాలనే ఆకాంక్షించారు.అంతే కానీ నేను నమ్మని వైధవ్యాన్ని నాకు అంట గట్టలేదు. ఈ లోటు ని  బ్రతికినంత కాలం మోయగలను. ఆ జ్ఞాపకాలు అయువునున్నంత కాలం నెమరు వేసుకుంటాను నా వారి కోసం దుఖం    దిగమింగి బ్రతుకు బాటలో  ఒంటరి ప్రయాణం సాగిస్తాను.తప్పదు ఇది హాలాహలం స్వీకరించక తప్పదు నాలా ఎందఱో అందరిలానే నేను 

ఆ నావ వెళ్లి పోయింది ఆ ఒడ్డే చేరి పోయింది 

అట్టాగే వెళ్లి పోయేనా నన్నిడిసి వెళ్లి పోయెనా 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి