నరసింహ సినిమాలో నీలాంబరి లా వుంటే బాగుండును
ఆ హీరొయిన్ భగ్నప్రేమ తో పిచ్చిదానిలా ఏళ్ల తరబడి హీరో పెళ్లి సి డి చూస్తూ వుంటుంది పగతో రగిలిపోతు వుంటుంది
నేను పోగొట్టుకున్న నా జీవితాన్ని సిడి లలో చూస్తున్నాను
ఆనందాలు వెల్లువైన సందర్భాలు దృశ్య మాలికల రూపములో చూసుకుంటూ కాలాన్ని వెనక్కి తీసుకేడుతూ పిచ్చిదానిలా ఆనందం దుఃఖం అనుభవిస్తూ
ఇలాగె వుంటే బాగుంటుంది అనిపిస్తోంది స్తబ్దమయిన మనసు తన వారినుండి తప్పిపోయిన పిల్లల్లాగా బోరుమంటోంది
ఇష్టాలు అయిస్టాలు భావాలూ కోరికలు గుర్తించేవారు ఏది చేసిన అభినందించేవారు సమర్ధించి వెనకేసుకొచ్చేవారు
మన కన్నాపెద్దవారే
మనకెంత వయసు వచ్చినా వయసులో పెద్దగ లాలించినా కోపగించినా ప్రేమించినా తల్లితండ్రులు అక్కలు అన్నలు భర్త వీళ్ళే
మన కన్నా పెద్ద వాళ్ళు లేకుంటే
జీవితం ఒంటరి పోరాటం
మన ఉనికి పనికి రాని పనులు వ్యక్తులు నిండిన
ఈ ప్రపంచములో కన్నా గతం గుర్తులేక వర్తమానం తెలీక భవిష్యత్ ఊహించని పిచ్చి బతుకు మేలు
chala chakkaga chaypparu pedda vallu anayvallu undaali appudu chala baaguntundi. meeru chalaaa bhadato vyakta parichaaru iii blog
రిప్లయితొలగించండి