'పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు'
'మళ్ళీ తన మనిషి ఒడిలోకే చేరు '
అని ఎదురుచూసినా
'రెప్పనై వుంటాను నీ కంటికీ'
'పాపగా వస్తాను నీ ఇంటికీ'అని,చెప్పారనుకుని భ్రమ పడినా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ'
మనసొక్కటే కలిసున్నది ఏనాడైనా
ఉండి కూడా వున్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే'
అని వేదన పడినా
'ఇన్ని వేల చుక్కల్లో నిను నే వేతికేనే'
అని ఎంత వెతికినా దొరకరని రోదించినా
'ఉన్నా నేను నీలోనా' నీకుతేలుసునా?
అసలుందో లేదో నా ప్రాణం, నీకు దూరమయి బ్రతకగలనా'
అని భయపడినా
జరిగిన ఘోరానికి సాక్షిగా మిగిలిన వారు అనుక్షణం మాటల్లో పాటల్లో పోయిన వారినే స్మరిస్తూ జ్ఞాపకాలు
నెమరు వేస్తూ పోయినోళ్ళ తీపిగుర్తులుగా ' మనుగడ మరణ శాసనమయి, 'గుండె లోతుల్లో గునపాల పోట్లుగా,' గతం స్వగతమయినా. కళ్ళు నీళ్ళు లేని కాసారమయినా
'వెన్నెలలెంతగా విరిసిన కానీ చంద్రుణ్ణివిడిపోలేవు.
'కెరటాలేన్తగాఎగిసిన కానీ కడలినివిడిపోలేవు.
'తనువులు వేరైనా. దారులు వేరయినా,
'ఆ బంధాలే నిలిచేనులే. అన్నట్లు పోయిన వారి అనుబంధమే ఆలంబనగా అశువులు బాసె దాకా జేవితాన్ని నడిపించాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి